జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి ఆముదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?

పూర్వ కాలం నుండి ఆముదాన్ని సౌందర్య సాధనలలో వాడుతున్నారు.

ఆముదంలో బ్యాక్టీరియా, ఫంగల్ వ్యతిరేక లక్షణాలు, విటమిన్ ఇ, ఖనిజలవణాలు, ఒమేగా 6, 9 ఫ్యాటీయాసిడ్లు, ప్రొటీన్లు ఉండటం వలన జుట్టు రాలటాన్ని అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

జుట్టును మృదువుగా,జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది.ఇప్పుడు ఆముదాన్ని ఎలా ఉపయోగిస్తే జుట్టు రాలకుండా బాగా ఒత్తుగా పెరుగుతుందో తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఆముదంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి 2 గంటల పాటు ఆలా వదిలేయాలి.ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గిపోతుంది.

Advertisement
How To Use Castor Oil For Hair-How To Use Castor Oil For Hair-Telugu Health-Telu
How To Use Castor Oil For Hair

ఒక స్పూన్ ఆముదం నూనెలో ఒక స్పూన్ ఆవనూనె కలిపి తలకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.ఒక స్పూన్ ఆముదంలో ఒక స్పూన్ బాదాం నూనెను కలిపి జుట్టుకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాత తెలిపాయి షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

బాదాం నూనె పాడయిన జుట్టును రిపేర్ చేయటంలో బాగా పనిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు