పిల్ల‌ల‌పైనే క‌రోనా థార్డ్ వేవ్ గురి.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

కంటికి క‌నిపించ‌కుండా ల‌క్ష‌ల మందిని బ‌లి తీసుకున్న క‌రోనా వైర‌స్‌.ఎంత వేగంగా విస్త‌రిస్తుందో అంద‌రికీ తెలిసిందే.

ఫ‌స్ట్ వేవ్‌ను వ‌దిలించుకున్నామ‌ని ఊపిరి పీల్చుకునేలోపే.సెకెండ్ వైవ్ వ‌చ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇక సెకెండ్ వేవ్ ఉధృతి త‌గ్గ‌క ముందే.థార్డ్ వేవ్ అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతోంది.

అందులోనూ క‌రోనా థార్డ్ వేవ్ గురి పిల్ల‌ల‌పైనే ఉంటుంద‌ని వార్త‌లు రావ‌డంతో.త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మ‌రింత పెరిగిపోతోంది.

Advertisement
How To Protect Your Children From Corona Third Wave! Protect Your Children, Coro

అయితే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల విష‌యంలో ప‌లు జాగ్ర‌త్తలు తీసుకుంటే.వారిని మూడో వేవ్ ముప్పు నుంచి త‌ప్పించ‌వ‌చ్చ‌ని అంటున్నారు నిపుణులు.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో చూసేయండి.మొద‌ట పిల్ల‌ల డైట్‌పై పేరేంట్స్ దృష్టి పెట్టాలి.

పిల్ల‌ల బ్రేక్ ఫాస్ట్‌లో ఆయిల్ ఫుడ్స్ కాకుండా.ఓట్స్‌, గోధుమలతో తయారు చేసిన బ్రెడ్, ఇడ్లీ వంటివి పెట్టాలి.

మ‌రియు పిల్ల‌ల‌కు ఉద‌యాన్ని త‌ప్ప‌కుండా ఒక గ్లాస్ బెల్లం క‌లిపిన పాలు, ఉడికించిన గుడ్డు ఇవ్వాలి.

How To Protect Your Children From Corona Third Wave Protect Your Children, Coro
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
కార్తీక మాసంలోని చివరి సోమవారం.. మహా శివుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాల్సిందే..!

అలాగే పిల్ల‌ల డైట్‌లో కేవ‌లం కూరగాయ‌లే కాకుండా ఆకుకూర‌లు కూడా ఉండేలా చూసుకోవాలి.ఇక పిల్ల‌లు ఎలాగో ప‌చ్చ‌ళ్లు ఇష్ట‌ప‌డుతుంటారు.కాబ‌ట్టి, వారికి ఉసిరి, నిమ్మ వంటి ప‌చ్చ‌ళ్లు పెడితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

Advertisement

పిల్ల‌ల‌కు సాయంత్రం వేళ ఆక‌లి ఎక్కువ‌.దాంతో వారు జంక్ ఫుడ్‌పై ఇంట్ర‌స్ట్ పెడ‌తారు.

కానీ, ఈ క‌రోనా స‌మ‌యంలో పిల్ల‌ల‌ను జంక్ ఫుడ్ జోలికే వెళ్ల‌నివ్వ‌రాదు.సాయంత్రం వేల తాజా పండ్లు, ఇంట్లో త‌యారు చేసిన మిల్క్ షేక్‌, బ‌నాన షేక్‌, బాదం, జీడిపప్పు వంటివి పెడితే ఆక‌లి తీరుతుంది.

మ‌రియు ఇవి ఆరోగ్యం కూడా.

ఇక క‌రోనా నియ‌మాల గురించి పెద్ద‌ల‌కు తెలుసు.కానీ, పిల్ల‌ల‌కు తెలియ‌దు.అందుకే మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి.

చేతుల‌ను శానిటైజ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి.సోష‌ల్ డిస్టెన్స్ ఎలా పాటించాలి.

అన్న విష‌యాల‌ను పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే ఓపిగ్గా, అర్థ‌మ‌య్యేలా వివ‌రించాలి.అలాగే పిల్ల‌ల చేత కూడా ప్ర‌తి రోజు క‌నీసం ప‌ది నుంచి ఇర‌వై నిమిషాలైనా వ్యాయామాలు, యోగాలు చేయించాలి.

త‌ద్వారా పిల్ల‌లు ఫిట్‌గా, హెల్తీగా మార‌తారు.ఫ‌లితంగా ఎటువంటి వైర‌స్‌లు వారిని ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు