తమ ముఖ చర్మం అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.అందులోనూ అమ్మాయిలైతే అందమైన మెరిసే చర్మం కోసం ఆరాటపడని రోజంటూ ఉండదు.
ఈ క్రమంలోనే చర్మం కోసం ఎన్నెన్నో క్రీమ్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు.వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మరియు గ్లోయింగ్ గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి.? అన్నది తెలుసుకుందాం పదండి.ముందు ఒక నిమ్మ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పై తొక్కను మాత్రం సపరేట్ చేసుకోవాలి.
ఈ నిమ్మ తొక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, గ్రైండ్ చేసి పెట్టుకున్న నిమ్మ తొక్కల పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి, వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.మురికి, మృతకణాలు తొలగిపోతాయి.చర్మం బ్రైట్ గా మరియు గ్లోయింగ్‌గా మారుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటిస్తే ట్యాన్ సమస్య కూడా ఉండదు.కాబట్టి వైట్, బ్రైట్ మరియు గ్లోయింగ్ స్కిన్ కావాలని ఆరాటపడేవారు తప్పకుండా ఆ రెమెడీని ప్రయత్నించండి.