పిల్ల‌లు మ‌ధుమేహం బారిన ప‌డ‌కూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

మ‌ధుమేహం.పూర్వం యాబై, అర‌వై ఏళ్లు దాటిన వారిలోనే ఈ స‌మ‌స్య క‌నిపించేది.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో చిన్న పిల్ల‌లు సైతం మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డుతున్నారు.ఈ లిస్ట్‌లో మీ పిల్ల‌లు ఉండ‌కూడ‌దు అనుకుంటే వారి విష‌యంల ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటీ.? అన్న‌ది లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.వ‌య‌సుకు మించి బ‌రువు పెర‌గ‌డం మ‌ధుమేహానికి దారి తీయొచ్చు.

అందు వ‌ల్ల‌, పిల్ల‌ల బ‌రువు అదుపు త‌ప్ప‌కుండా చూసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అందుకు రోజూ వారి చేత ఔట్ డోర్ గేమ్స్‌ ఆడించ‌డం, చిన్న చిన్ని వ్యాయామాలు చేయించ‌డం చేయాలి.

Advertisement

అలాగే పిల్ల‌ల డైట్‌లో షుగ‌ర్ ఫుడ్స్‌ను పూర్తిగా క‌ట్ చేయాలి.న‌ట్స్‌, తాజా పండ్లు, ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, పప్పు ధాన్యాలు వంటివి వారి ఆహారంలో భాగంగా చేయాలి.

స‌రైన నిద్ర లేక పోయినా పిల్ల‌లు మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డే అవ‌కాశం ఉంటుంది.కాబ‌ట్టి, ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌ల పాటు పిల్ల‌లు నిద్ర పోయేలా చూసుకోవాలి.

నేటి టెక్నాల‌జీ కాలంలో దాదాపు అంద‌రు పిల్ల‌లు స్మార్ట్ ఫోన్ల‌కు, ల్యాప్ టాప్ల‌కు అతుక్కుపోతూ.గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ఉంటున్నారు.అయితే అధికంగా కూర్చోవ‌డం వ‌ల్ల‌నూ మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.

సో.పిల్ల‌ల స్క్రీన్ టైమ్‌ను ఎంత త‌గ్గిస్తే వారి ఆరోగ్యానికి అంత మంచిది.ఇక పిల్ల‌ల‌కు మంచి ఆహారం పెట్ట‌డం ఎంత ముఖ్య‌మో.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

స‌రైన స‌మ‌యానికి పెట్ట‌డం కూడా అంతే ముఖ్యం.అందు వ‌ల్ల, పిల్ల‌ల‌కు ఫుడ్‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు కాకుండా టైమ్ టు టైమ్ ఇవ్వండి.

Advertisement

ఈ అల‌వాటు మ‌ధుమేహం నుంచి కాపాడ‌ట‌మే కాదు.వారికి మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తుంది.

తాజా వార్తలు