ముఖాన్ని మృదువుగా మార్చే బ్రెడ్‌..ఎలాగంటే?

చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునేది బ్రెడ్‌నేముఖ్యంగా ఉద్యోగ‌స్తులు బ్రేక్ ఫాస్ట్ చేసుకునే స‌మ‌యం, తీరిక‌ లేక బ్రెడ్‌తో క‌డుపు నింపుకుంటుంటారు.

ఇక బ్రెడ్‌తో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు.

ఎలా చేసినా బ్రెడ్ రెసిపీలు సూప‌ర్ ఫాస్ట్‌గా అయిపోతుంటాయి.అయితే బ్రెడ్ తిన‌డానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ముఖాన్ని మృదువుగా, నిగారింపుగా మార్చ‌డంలో బ్రెడ్ అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా బ్రెడ్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో తెలుసుకోండి.

ముందుగా బ్రెడ్ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ బ్రెడ్ పొడిలో పాల మీగ‌డ వేసి బాగా మిక్స్ చేసుకుని.

Advertisement

ముఖానికి అప్లై చేసుకోవాలి.పావు గంట త‌ర్వాత వేళ్ల‌తో మెల్ల‌గా మెల్ల‌గా రుద్దుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తూ ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి ముఖం మృదువుగా మారుతుంది.

అలాగే ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ముఖం నిర్జీవంగా మారుతుంటుంది.అలాంట‌ప్పుడు బ్రెడ్ పొడిలో కొద్దిగా ముల్తానీ మ‌ట్టి మ‌రియు రోజ్ వాటర్ వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి బాగా డ్రై అయిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు కోమ‌లంగా, నిగారింపుగా కూడా మారుతుంది.ఒక గిన్నెలో బ్రెడ్ పొడి, ఓట్స్ పొడి మ‌రియు తేనె వేసి బాగా క‌లుపుకోవాలి.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.కాస్త ఆరిన త‌ర్వాత మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ ఫేస్ క్లీన్ చేసుకోవాలి.

Advertisement

వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం సున్నితంగా, అందంగా త‌యార‌వుతుంది.

తాజా వార్తలు