బాదం నూనెలో ఇవి క‌లిపి రాస్తే.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డం ఖాయం?

ఇటీవ‌ల‌ కాలంలో ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మంది యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

దాంతో కంగారు, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు పెరిగిపోతాయి.

కొంద‌రైతే తెల్ల జుట్టు స‌మ‌స్య వ‌ల్ల డిప్రెష‌న్‌కు కూడా గుర‌వుతుంటారు.వయసు పెరిగే కొద్ది తెల్ల జుట్టు రావడం స‌ర్వ సాధార‌ణం.

కానీ, యంగ్‌గా ఉన్న‌ప్పుడే జుట్టు తెల్ల‌బ‌డుతుందంటే మాత్రం చాలా కార‌ణాలు ఉన్నాయి.అదే స‌మ‌యంలో తెల్లు జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు కూడా చాలా ప‌ద‌ర్థులు ఉన్నాయి.

ముఖ్యంగా బాదం నూనెలో ఇప్పుడు చెప్ప‌బోయేవి క‌లిపి రాస్తే.మీ తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల‌బ‌డ‌టం ఖాయం.

Advertisement

మ‌రి ఆ బాదం ఆయిల్ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్‌లో బాదం నూనె తీసుకుంటే.

అందులో నువ్వుల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు బాగా ప‌ట్టించి.

అర గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అలాగే గోరింటాకు ఆకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి.ఈ పొడిని ఒక బౌల్‌లో వేసి నీరు పోసి ఉడికించారు.ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికిన త‌ర్వాత బాదం ఆయిల్ వేసి.

Advertisement

స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఈ మిశ్ర‌మం చ‌ల్లారాక జుట్టుకు అప్లై చేయాలి.

ఒక గంట పాటు వ‌దిలేసి.ఆ త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.

ఇలా త‌ర‌చూ చేసినా మంచి ఫ‌లితంగా ఉంటుంది.ఇక ఒక బౌల్ తీసుకుని అందులో బాదం నూనె, ఆముదం, మ‌రియు ఎగ్ వైట్ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల మ‌రియు కుద‌ళ్ల‌‌కు బాగా ప‌ట్టించి.గంట‌ పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా చేసినా.

తెల్ల‌గా ఉన్న మీ జుట్టు క్ర‌మేన న‌ల్ల‌గా మారుతుంది.

తాజా వార్తలు