భక్తులతో రద్దీగా మారిన తిరుమల గిరులు సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?

తిరుమల గిరులు( Tirumala ) ఆదివారం రోజు భక్తులతో రద్దీగా ఉన్నాయి.

నడకదారి రోడ్డు మార్గాన పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటుండడంతో సప్తగిరులపై ఎటు చూసినా భక్తులతో బారెలు తిరిన క్యూ లైన్ లో కనిపించాయి.

దీనివల్ల సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంటే, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది.శ్రీవారి దర్శనం కోసం భారీగా భక్తులు క్యూ లైన్ లలో బారులు తీరారు.

దీనితో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఒకటి, రెండు లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలకు వ్యాపించాయి.

How Much Time Does It Take To Visit Tirumala Girulu Which Has Become Crowded Wit

శ్రీవారి దర్శనానికి( venkateswara swamy ) వైకుంఠ క్యూ కాంప్లెక్స్ రెండు లోని 31 కంపార్ట్మెంట్ లతో పాటు నారాయణగిరి, ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండి ప్రస్తుతం సర్వదర్శన క్యూ లైన్ ఏటిసి వైపు నుంచి ఏటిజిహెచ్‌ వద్దకు వ్యాపించింది.సుమారు కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.ఇంకా చెప్పాలంటే కాలినడకన భక్తులు ప్రవాహంలో తిరుమలకు తరలివస్తున్నారు.

Advertisement
How Much Time Does It Take To Visit Tirumala Girulu Which Has Become Crowded Wit

తమ మొక్కులు చెల్లింపులో భాగంగా పెద్ద సంఖ్యలో నడక మార్గంలో భక్తులు తరలివస్తుండడంతో కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించిన దివ్య దర్శనం టోకెన్ల కోట పూర్తవ్వడంతో కాలినడకన తిరుమల కు చేరుకుంటున్న భక్తులు సర్వదర్శనం ద్వారానే స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉండడంతో సర్వదర్శనం క్యూలైన్ అంతకంతకు పెరిగిపోతోంది.

How Much Time Does It Take To Visit Tirumala Girulu Which Has Become Crowded Wit

వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు.శ్రీవారి దర్శనంలో కేవలం సర్వ, దివ్య, ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులను మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) దర్శనానికి అనుమతిస్తోంది.భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో స్వామివారిని సర్వదర్శనం గుండానే దర్శించుకోవాలంటే 24 గంటలకు పైగా సమయం పడుతుంది.

దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం అలాగే ఎప్పటికప్పుడు తాగు నీరు, అల్పాహారం లాంటివి నిరంతరయంగా అందజేస్తున్నారు.అంతేకాకుండా అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు