రావణాసురుడి కుమారుడికి ఇంద్రజిత్తు అనే పేరు ఎలా వచ్చింది?

రావణాసురుడికి ఆయన భార్య మండోదరికి పుట్టిన వాడే ఇంద్రజిత్తు.ఇతను జన్మించినప్పుడు అరిచిన అరుపు మేఘం, ఉరిమిన పిడుగు శబ్దం వినిపిస్తుంది.

ఇది విన్న మండోదరి, రావణాసురులు తమ కుమారుడికి మేఘ నాధుడు అని పేరు పెట్టారు.ఆ తర్వాత కొన్నాళ్లకి స్వర్గానికి వెళ్లి ఇంద్రుడిని జయించాడు.

How Did Ravanasura Son Get The Name Indrajith Details, Ravana, Indrajithu, Rama,

అందువల్ల మేఘ నాధుడికి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది.అంతే కాదండోయ్ పరమేష్టి అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని కూడా సంపాదిస్తాడు.

యుద్ధ సంగ్రామంలో ఆకాశంలోకి వెళ్లి మేఘాల్లో యుద్ధం చేయడం ఈయన గొప్పతనం.రామ రావణ యుద్ధం జరిగినప్పుడు ఇంద్రజిత్తు చురుకైన పాత్ర పోషించాడు.

Advertisement

ఇంద్రజిత్తు ఆ యుద్ధంలో రామ లక్ష్మణులను నాగ పాశంతో బంధించాడు.అయితే గరుత్మంతుడు వారికి సాయం చేసి నాగ పాశం నుంచి విడిపిస్తాడు.

ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు యజ్ఞం చేసి వెళ్లే వాడట.ఆ యజ్ఞ మహిమ వల్ల ఇంద్రజిత్తు ఆ యుద్ధంలో గెలిచేవాడు.

ఆ యజ్ఞాన్ని భంగం చేస్తే తప్ప ఇంద్రజిత్తును ఓడించలేమని తెలుసుకున్న లక్ష్మణుడు.అతను చేసే యజ్ఞానికి ఆటంకం కల్గించాడు.ఆపై ఇంద్రజిత్తు ధ్యానంలో ఉండగా అతడిని హతమార్చాడు.

అలా రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తును ఓడించాడు.ఇంద్రజిత్తు ఆది శేషుని కుమార్తె అయిన సులోచనను పెళ్లి చేసుకున్నాడు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025

ఈమెకు ప్రమీల అనే మరో పేరు కూడా ఉంది.కొందరు ఆది శేషుడు లక్ష్మణ అంశ అని భావిస్తారు.

Advertisement

ఇలా ఇంద్రజిత్తు లక్ష్మణుడి అల్లుడని కొన్ని పురాణాల్లో చెప్పబడింది.

తాజా వార్తలు