ముఖంపై అస‌హ్యంగా క‌నిపించే గుంత‌ల‌ను ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

సాధార‌ణంగా కొంద‌రికి ముఖంపై గుంత‌లు లేదా గుంట‌లు ప‌డుతుంటాయి.ఇవి చూసేందుకు అస‌హ్యంగా క‌నిపించ‌డ‌మే కాదు అందాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

అందుకే వీటిని నివారించుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలా సుల‌భంగా చ‌ర్మంపై ఏర్ప‌డిన గుంత‌ల‌ను నివారించుకుని ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల పెరుగు, చిటికెడు జాజికాయ పొడి, ఒక స్పూన్ తేనె, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, పావు స్పూన్ మెంతి పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం నీటితో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి.

Advertisement

ఇలా రోజుకు ఒక సారి చేస్తే గుంత‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.అలాగే బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎర్ర కంది ప‌ప్పు పౌడ‌ర్‌, రెండు స్పూన్ల పుదీనా జ్యూస్‌, ఒక స్పూన్ లెమెన్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి.స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో స్మూత్‌గా మ‌సాజ్ చేయండి.

అపై బాగా ఆర‌నిచ్చి.అప్పుడు చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఇక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాగా ప‌డిన అర‌టి పండు ముక్క‌లు అర క‌ప్పు, రెండు స్పూన్ల పెరుగు మ‌రియు కొన్ని గులాబీ రేకులు వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

Advertisement

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే గుంత‌లు పోయి చ‌ర్మం స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మారుతుంది.

తాజా వార్తలు