పిల్ల‌ల్లో మ‌ల‌బ‌ద్ధ‌క నివార‌ణ‌కు బెస్ట్ & ఎఫెక్టివ్ టిప్స్ ఇవే..!

మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మల విసర్జన కాకపోవ‌డాన్నే మ‌ల‌బ‌ద్ధ‌కం అంటారు.పిల్ల‌ల్లో అత్య‌ధికంగా క‌నిపించే స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.

మ‌ల‌బ‌ద్ధ‌కం ఉన్న పిల్ల‌లు యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా అస్స‌లు ఉండ‌రు.ఎప్పుడూ నీర‌సంగా, న‌ల‌త‌గా క‌నిపిస్తుంటారు.

త‌ర‌చూ పొట్ట ఉబ్బ‌రం, పొట్ట నొప్పితో బాధ ప‌డుతుంటారు.పోష‌కాల లోపం, త‌గినంత నీరు తీసుకోక‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, ఫైబ‌ర్ లోపం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల్లో మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.

పిల్ల‌ల్లో మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని మాత్రం ఖ‌చ్చితంగా నివారించాల్సి ఉంటుంది.అందు కోసం ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారించ‌డంలోనూ ఆముదం ఎఫెక్టివ్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

ఒక గ్లాస్ పాల‌లో అర స్పూన్ ఆముదాన్ని క‌లిపి పిల్లల చేత తాగితే.క‌డుపు క్లీన్ అయిపోతుంది.

అవిసె గింజ‌లు సైతం మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని దూరం చేయ‌గ‌ల‌వు.ఒక గ్లాస్ వాట‌ర్‌లో అవిసె గింజ‌ల‌ను వేసి బాగా మ‌రిగించి.

ఆ నీటిని ఉద‌యాన్నే పిల్ల‌ల చేత తాగించాలి.ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే పైన చెప్పుకున్న‌ట్టు శ‌రీరంలో నీరు స‌రిగ్గా లేక‌పోయినా మ‌ల‌బ‌ద్ధ‌కం ఏర్ప‌డుతుంది.అందువ‌ల్ల , పిల్ల‌ల‌కు వాట‌ర్‌ను ఎక్కువ‌గా తాగించాలి.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

వాట‌ర్ మాత్ర‌మే కొబ్బ‌రి నీళ్లు, పండ్ల ర‌సాల‌ను సైతం త‌ర‌చూ ఇవ్వాలి.

Advertisement

వాముతోనూ పిల్ల‌ల్లో మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని త‌గ్గించ వ‌చ్చు.ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక స్పూన్ వాము గింజ‌ల‌ను వేసి బాగా మ‌రిగించి.ఆ నీటితో ఉద‌యాన్నే పిల్ల‌ల‌కు ప‌ట్టించాలి.

ఇలా చేస్తే వాములో ఉండే ప‌లు పోష‌కాలు పేగు క‌ద‌లిక‌ల‌ను పెంచి మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారిస్తాయి.మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ ప‌డే పిల్ల‌ల డైట్‌లో ఫైబ‌ర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.

అదే స‌మ‌యంలో జంక్ ఫుడ్‌, ఆయిలీ ఫుడ్‌, ప్యాకెట్లలో నింపిన స్నాక్స్ వంటి వాటిని పిల్ల‌ల డైట్ నుంచి క‌ట్ చేయాలి.ఎందుకంటే, వీటి వ‌ల్ల పిల్లల్లో మలబద్దకం సమస్య మ‌రింత ఎక్కువ అవుతుంది.

తాజా వార్తలు