మిస్ యూనివ‌ర్స్, మిస్ ఇండియా, మిస్ వ‌ర‌ల్డ్ అవార్డులు గెలిచాక‌….సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్

అందానికి తోడు అద్భుత న‌ట‌న ఉంటే సినిమా రంగాన్ని ఏలే అవ‌కాశాలు వ‌స్తాయి.ఒక్కోసారి న‌ట‌న కాస్త త‌క్కువ‌గా ఉన్నా ఫ‌ర్వాలేదు కానీ.

అందం విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.అందుకే అందాల పోటీల్లో టైటిల్ గెలిచిన వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికేందుకు రెడీగా ఉంటుంది సినిమా ఇండ‌స్ట్రీ.

ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తొలుత అందాల పోటీల్లో విజేత‌లుగా నిలిచిన వాళ్లే.ఇంత‌కీ ఆ స్టార్ హీరోయిన్స్ ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం!

జీన‌త్ అమ‌న్:

Heroines Who Came From Miss India, Miss Universe And Miss World Back Ground, Bol

ఈ బాలీవుడ్ బ్యూటీ మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ అవార్డ్ గెలుచుకున్న త‌ర్వాతే సినీ తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది.ద‌మ్ మారో ద‌మ్…హ‌రే రామా హ‌రే కృష్ణ లాంటి ఐటెం సాంగ్స్ తో దుమ్ము రేపింది.

జూహీ చావ్లా:

Heroines Who Came From Miss India, Miss Universe And Miss World Back Ground, Bol
Advertisement
Heroines Who Came From Miss India, Miss Universe And Miss World Back Ground, Bol

1984లో ఈమె మిస్ ఇండియా పోటీల్లో విజేత‌గా నిలిచింది.అనంత‌రం అమిర్‌ఖాన్ తో ఖ‌‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్ అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది.ఈసినిమా మంచి విజ‌యం సాధించింది.

ఐశ్వ‌ర్య రాయ్:

Heroines Who Came From Miss India, Miss Universe And Miss World Back Ground, Bol

1994లో మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్ గెలుచుకున్న ఈ బెంగ‌ళూరు బ్యూటీ.సినిమా రంగాన్ని ఏలింది.తొలు మూవీ నుంచే మంచి విజ‌యాలు సాధించి సినిమా రంగ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త సాధిచుకుంది.

సుస్మితా సేన్ :

1994 లో మిస్ యూనివ‌ర్స్ అవార్డ్ సొంతం చేసుకున్న సుస్మితా సేన్.బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి మంచి విజ‌యాలు సాధించింది.అనంత‌రం పెళ్లి చేసుకుని.

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో హ్యాపీగా గ‌డుపుతోంది.

లారా దత్తా:

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

మొద‌ట్లో మోడ‌లింగ్ చేసిన లారా ద‌త్తా.2000లో మిస్ యూనివ‌ర్స్ టైటిల్ నెగ్గింది.అనంత‌రం అందాజ్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి ప‌లు సినిమాల్లో న‌టించింది.

ప్రియాంక చోప్రా:

Advertisement

2000లో మిస్ వ‌ర‌ల్డ్ అవార్డ్ పొందించి ఈ పొడుగుకాళ్ల బ్యూటీ.అనంత‌రం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేస్తూ సూప‌ర్ స‌క్సెస్ గా కొన‌సాగుతోంది.

నెహా ధూపియా:

ఈమె 2002లో మిస్ ఇండియా టైటిల్ పొందింది.ఆ త‌ర్వాత ఖ‌యామ‌త్, జూలీ లాంటి సినిమాల్లో న‌టించింది.

దియా మీర్జా:

2000లో మిస్ ఆసియా ప‌సిఫిక్ అవార్డ్ గెల్చుకున్నది ఈ హైద‌రాబాద్ బ్యూటీ.2001లో రెహ‌నా హై తేరే దిల్ మే అనే సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ చేసింది.అనంత‌రం మ‌రికొన్ని సినిమాల్లో న‌టించింది.

జాక్వెలైన్ ఫెర్నాండెజ్:

ఈ బ్యూటీ తొలుత మిస్ శ్రీలంక అవార్డ్ గెలుపొందింది.అనంత‌రం బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేసింది.ప్ర‌స్తుతం స‌ల్మాన్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

మీనాక్షి శేషాద్రి:

ఈ అమ్మాయి కేవ‌లం 17 ఏళ్ళ‌కే 1981లో మిస్ ఇండియా అవార్డ్ గెలిచింది.అనంత‌రం దామిని, ఘాయ‌ల్, ఘ‌ట‌క్ సినిమాల‌తో వ‌రుస హిట్స్ సాధించింది.

న‌మ్ర‌తా:

1993లో మిస్ ఇండియా పోటీల్లో విజేత‌గా నిలిచింది ఈ అమ్మ‌డు.అనంత‌రం వాస్వ‌వ్ అనే హిందీ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంది.ఆఆఆఆ త‌ర్వాత మ‌హేష్ ను పెళ్ళి చేసుకొని సినిమాల‌కు దూరం అయ్యింది.

పూజా భాట్రా:

1993లో మిస్ ఇండియా ప‌సిఫిక్ అవార్డ్ గెలుచుకున్న పూజా భాట్రా.అనంత‌రం విరాస‌త్ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంది.ఈ మూవీ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ అంత‌గా క‌నిపించ‌లేదు.

త‌నుశ్రీ ద‌త్త‌:

2004 మిస్ ఇండియా యూనివ‌ర్స్ టైటిల్ నెగ్గింది త‌నుశ్రీ ద‌త్త‌.ఆషిక్ బ‌నాయా ఆప్నేలో ఇమ్రాన్ హ‌ష్మీతో హాట్ సీన్ల‌లో క‌నిపించింది.ఆ త‌ర్వాత పెద్ద‌గా క‌నిపించిన దాఖలాలు లేవు.

తాజా వార్తలు