సక్సెస్ సీక్రెట్ ఏంటో బయటపెట్టిన శ్రీవల్లి...అదే ఈ స్థాయిలో నిలబెట్టిందంటూ కామెంట్స్?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటి రష్మిక కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఏకంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని అగ్రతారగా పేరు సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.

అల్లు అర్జున్ సరసన రష్మిక నటించిన పుష్పా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి ఈమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చిందని చెప్పాలి.

ఈ సినిమా విడుదలైన తర్వాత రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఇలా ఈమె కంటే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఎంతో సతమతమవుతున్నారు.

ఈ క్రమంలోనే రష్మిక నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే తనకు వరుస సినిమా అవకాశాలు రావడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు.ఈ క్రమంలోనే రష్మిక ఈ విషయంపై స్పందిస్తూ తనకు ఇలా అవకాశాలు రావడానికి తన సక్సెస్ సీక్రెట్ ఏంటో ఈమె తెలియజేశారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తాను కన్నడ చిత్ర పరిశ్రమలో అవకాశం అందుకొని సినిమాలో నటిస్తుండగానే తనకు తెలుగులో గీతగోవిందం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.ఇలా తనకు అవకాశం రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనని తాను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డానని ఈమె తెలిపారు.ఇక తనకు వచ్చిన పాత్రలో నేను నటించిన తీరు దర్శక నిర్మాతలకు నచ్చడం వల్లే తనకు అవకాశాలు వస్తున్నాయని తనకు వచ్చిన ఈ అవకాశాలు కేవలం అదృష్టం వల్ల రాలేదని దాని వెనుక ఎంతో కష్టం ఉందని, ఆ కష్టమే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని రష్మిక ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

తాజా వార్తలు