హీరోయిన్ మీనా తల్లి కూడా టాలీవుడ్ నటి అని మీకు తెలుసా..?

స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకా ఉంటారట కదా.అచ్చం అలానే ఒకప్పటి హీరోయిన్ మీనా ని చూస్తే నిజంగా మేనకానే దివికి దిగివచ్చినట్టుగా అనిపిస్తుంటుంది.

ఆమె అందమైన నటనతో, నాట్యంతో సుమారు 10 సంవత్సరాలు పాటు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా మనల్ని అలరించిన మీనా.సుదీర్ఘకాలం పాటు హీరోయిన్‌గా అగ్రహీరోలందరితో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని సొంతం చేసుకుంది.

అయితే 1975 సెప్టెంబర్ 16 న జన్మించిన మీనా మొదట బాలనటిగా ‘ఇల్లాలు ప్రియురాలు’, ‘బావ మరదలు’, రెండు రెళ్ళ ఆరు, సిరివెన్నెల లాంటి సినిమాలతో అందరిని మెప్పించి.‘నవయుగం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు.

ఆ తర్వాత సీతారామయ్య గారి మనమరాలు సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఇక వరసపెట్టి అవకాశాలను అందిపుచ్చుకుంది.సుందరకాండ, అల్లరి పిల్ల, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ముత్తు, సూర్యవంశం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది.

Advertisement

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలక్రిష్ణ, రజనీకాంత్ లతో జోడి కట్టి టాప్ హీరోయిన్‌గా అప్పట్లో ఒక వెలుగు వెలిగింది.అలా ఒక్క తెలుగులోనే కాకుండా.

తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ అగ్రహీరోలతో నటించారు మీనా.మోడల్‌గా.

బాలనటిగా హీరోయిన్‌గా.సింగర్‌గా.

డాన్సర్‌గా.టీవీ రియాలిటీ షో జడ్జ్‌గా అబ్బో ఆల్ రౌండర్ గా ఇండస్ట్రీని ఒక ఊపేసింది మీనా.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇంకా మీనా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మీనా చాల చక్కగా మాట్లాడగలదు.ఇంకా మీనా తన ఎనిమిదో ఏటనే చదవుకు ఫులుస్టాప్ పెట్టి పూర్తిస్థాయిలో నటిగా తన ప్రస్థానాని మొదలు పెట్టడం వలన చదవుకు దూరమయ్యాననే ఫీలింగ్ కలిగిందట .అందుకే కొద్దిగా వయసు వచ్చాకా ప్రెవేట్ గానే చదవుకోవడం మొదలుపెట్టి MA పూర్తి చేసింది.ఇక మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారే.

Advertisement

ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.ఇక మీనా తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ హీరోయిన్ అండ్ మలయాళంలో కూడా ఒక పెద్ద నటి.అందుకే మీనా బాల నటిగ త్వరగానే సినిమాల్లోకి అడుగుపెట్టేసింది.అలా మీనా వాళ్ళ అమ్మకూడా నటి కావడంతో మీనాను ఎలాగైన టాప్ హీరోయిన్ చేయాలనీ అనుకున్నారట.

జెమిని గణేశన్ ఒక పార్టీలో మీనాని చూసి ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆఫర్ ఇచ్చారట.ఇంకా ఈమె హీరోయిన్ కావడానికి వాళ్ళమ్మ ఏం ఏ రత్నం దగ్గరకు కూడా తీసుకెళ్ళిందట ఆయన మీనని చూడగానే అవకాశం ఇచ్చారట.

అలా ఎక్కడికి వెళ్లిన మీనాకి అవకాశాలు రావడంతో త్వరగానే స్టార్ హీరోయిన్ అయింది.

ఇక 2000 సంవత్సరం తర్వాత ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో 2009 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా విద్యాసాగర్ ను పెళ్ళిచేసుకొని సెట్టిల్ అయిపోయింది.ఇక మీనాకి ఒక కూతురు కూడా ఉంది.కూతురు కూడా ప్రెసెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ సినిమాల్లో విజయ్ దళపతి లాంటి స్టార్ హీరోలతో నటిస్తోంది.

మీనా హీరోయిన్ గా ఉన్నప్పుడు విజయ్ తో నటించాలని ఉండేదట కానీ డేట్స్ కుదరక ఎప్పుడు ఆ అవకాశం రాలేదు కానీ తన కూతురుకి ఆ అవకాశం రావడంతో మీనా ఫుల్ హ్యాపీ.సో, అదండీ మీనా వాళ్ళ అమ్మ రాజమల్లిక గారి వలెనే మీనా అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయింది.

తాజా వార్తలు