ఇండియన్ ఐడల్ వాగ్దేవి హీరోయిన్ గా చేస్తుందా..!

ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తైంది.

ఈ సీజన్ లో నెల్లూరికి చెందిన బివికె వాగ్దేవి టైటిల్ విన్నర్ గా నిలిచింది.

తన గాత్రమే కాదు తన అందంతో కూడా ఆడియెన్స్ ని మెప్పించింది వాగ్దేవి.ఆడియెన్స్ పోల్స్ లో వాగ్దేవి గాత్రాన్ని చూసి కాదు ఆమె అందచందాలని చూసి ఆమెని గెలిపించారని చెప్పొచ్చు.

Heroine Chance For Telugu Indian Idol Winner Vagdevi ,Vagdevi,Indian Idol Winner

ఇదిలాఉంటే తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వార్తల్లో నిలిచిన వాగ్దేవి గురించి అన్నిచోట్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి.ఈ క్రమంలో కొంతమంది ఆమెని హీరోయిన్ గా కూడా చేసేస్తున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని.ఆమె హీరోయిన్ గా కూడా నటిస్తుందని వార్తలు రాస్తున్నారు.

Advertisement

అయితే వాగ్దేవికి సినిమా ఛాన్స్ వచ్చిన మాట నిజమే కాని ఆమెకి యాక్టర్ గా కాదు సింగర్ గా ఆమెకు ఛాన్స్ వచ్చింది.అంతేకాదు థమన్ కూడా తన సినిమాలో ఒక పాట పాడే ఛాన్స్ ఇస్తానని అన్నారు.

సింగర్ కార్తీక్ కూడా తను మ్యూజిక్ డైరక్షన్ చేసే సినిమాలో కూడా అవకాశం ఇస్తానని అన్నారు.ఇలా తెలుగు ఇండియన్ ఐడల్ విన్ అవడమే కాకుండా వాగ్దేవి వరుస ఛాన్సులు కూడా అందుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు