నాకు పొగరని అనుకున్నారు.. అందుకే ఆఫర్లు ఇవ్వలేదు.. యశ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సౌత్ ఇండియాలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో యశ్( Hero Yash ) ఒకరనే సంగతి తెలిసిందే.

యశ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.

యశ్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో( Toxic Movie ) నటిస్తుండగా వచ్చే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కానుంది.అయితే యశ్ తనకు ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు రాకపోవడం గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో అందరూ నాకు పొగరు అని అనుకునేవారని యశ్ చెప్పుకొచ్చారు.ఎందుకంటే డైరెక్టర్లను నేను స్క్రిప్ట్ కాపీ అడిగేవాడినని ఈ హీరో పేర్కొన్నారు.

కథ నచ్చని పక్షంలో ఆ స్క్రిప్ట్ పై నమ్మకం లేకపోతే నేను సినిమా ఎలా చేయగలనని యశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.స్క్రిప్ట్ ను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత సినిమా మొదలుపెడదాం అని నేను చెప్పేవాడినని యశ్ పేర్కొన్నారు.

Hero Yash Sensatioanl Comments About His Movie Offers Details, Yash , Hero Yash,
Advertisement
Hero Yash Sensatioanl Comments About His Movie Offers Details, Yash , Hero Yash,

అది కొందరికి నచ్చేది కాదని ఆ విధంగా నేను చాలా సినిమాలు కోల్పోయానని యశ్ వెల్లడించారు.మొగ్గిన మనస్సు సినిమా( Moggina Manasu Movie ) నిర్మాత మాత్రం నన్ను బలంగా నమ్మాడని ఆయన వల్లే నేను చివరి నిమిషంలో ఆ సినిమాలో జాయిన్ అయ్యానని యశ్ చెప్పుకొచ్చారు.ఆ సినిమా డైరెక్టర్ శశాంక్ పూర్తి కథ చెప్పడంతో పాటు నా రోల్ గురించి కూడా వివరించారని యశ్ కామెంట్లు చేశారు.

Hero Yash Sensatioanl Comments About His Movie Offers Details, Yash , Hero Yash,

ఇప్పటికీ ఆ ఇద్దరిపై ఆ సినిమా యూనిట్ పై నాకు ఎనలేని గౌరవం ఉందని యశ్ చెప్పుకొచ్చారు.టాక్సిక్ గురించి అప్ డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని యశ్ తెలిపారు.టాక్సిక్ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

టాక్సిక్ సినిమాతో యశ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...
Advertisement

తాజా వార్తలు