పాదాల పగుళ్లను సుల‌భంగా నివారించే హెన్నా..ఎలాగంటే?

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది పాదాల‌ ప‌గుళ్ల స‌మ‌స్య‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.

పొడి గాలి, తేమ సరిగ్గా లేకపోవడం వ‌ల్లే ఈ సీజ‌న్‌లో పాదాల‌పై ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి.దాంతో వాటిని త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ర‌క‌ ర‌కాల‌ క్రీములు, ఆయిల్స్ వాడుతుంటారు.అయినా ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.

అయితే హెన్నా(గోరింటాకు) పాదాల ప‌గుళ్ల‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం హెన్నాను ఉప‌యోగించి పాదాల పగుళ్ల‌ను ఎలా త‌గ్గించుకోవాలో ఓ చూపు చూసేయండి.

Advertisement

గోరింటాకు ఆకులను తీసుకొచ్చుకుని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు రెండు స్పూన్ల గోరింటాకు పేస్ట్‌లో ఒక స్పూన్ ఆలివ్‌ ఆయిల్‌ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే గ‌నుక పాదాల ప‌గుళ్లు క్ర‌మంగా త‌గ్గి.

మృదువుగా, కోమ‌లంగా మార‌తాయి.

హెన్నాను యూజ్ చేసి మ‌రో విధంగా కూడా పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.అందుకు ముందుగా కొన్ని గోరింటాకు ఆకుల‌ను తీసుకుని నీడ‌లో ఎండ బెట్టుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల గోరింటాకు పొడి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్​ రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి.ముప్పై నుంచి న‌ల‌భై నిమిషాల పాటు ఆర‌ బెట్టు కోవాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి.

Advertisement

ఇలా చేసినా కూడా పాదాల ప‌గుళ్లు సుల‌భంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

" autoplay>

తాజా వార్తలు