ఉదయాన్నే పరగడుపున 4 కరివేపాకులు తింటే ఏమి జరుగుతుందో తెలుసా?

కరివేపాకు అంటే మన అందరికి తెలుసు.తప్పనిసరిగా కూరల్లో వేస్తూ ఉంటాం.

కూరల్లో వేయటం వలన కొరకు రుచి కూడా వస్తుంది.ఇంతవరకు అందరికి తెలుసు.

కానీ కరివేపాకులో ఉన్న పోషక విలువల గురించి ఎవరికీ తెలియదు.సాధారణంగా అందరు కూరల్లో వేసిన కరివేపాకును తీసి పడేస్తూ ఉంటారు.

కానీ కరివేపాకు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.కరివేపాకులో కోహినిజెన్ అనే గ్లుకోజైడ్ అనే పదార్ధం ఉండుట వలన కరివేపాకు రుచి,వాసన ఆలా ఉంటాయి.

Advertisement

కరివేపాకు లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పిండి పదార్ధాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.మనం ప్రతి రోజు 4 కరివేపాకు ఆకులను తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కంటి చూపు మెరుగు పరచడంలో, మెదడుని ఉత్తేజితం చేయడంలో, జ్ఞాపక శక్తి ని పెంచడంలో కరివేపాకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.పిల్లల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చి వారి పెరుగుదలకు సహాయపడుతుంది.

కరివేపాకు తినడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించే రసాయనాల విడుదలకు దోహదం చేస్తుంది.తద్వారా మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది.

కరివేపాకులో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకలను దృడంగా ఉంచుతుంది.అందువల్ల ఎముకలు బలహీనంగా ఉన్నవారు కరివేపాకు తింటే చాల సహాయపడుతుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే..ఖ‌చ్చితంగా చేప‌లు తినాల్సిందే!

గర్భిణి స్త్రీలు వేవిళ్ళతో బాధపడుతూ ఉంటారు.ఆ సమయంలో కరివేపాకు రసంలో రెండు స్పూన్ల నిమ్మ రసం, కొద్దిగా తేనే కలిపి ఇస్తే తగ్గిపోతాయి.

Advertisement

ప్రతి రోజూ రెండు కరివేపాకు ఆకులు నమిలి మింగితే నోటి పూత తగ్గిపోతుంది.ప్రతి రోజు పరగడుపున 4 కరివేపాకు ఆకులను నమిలితే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

మనలో చాలా మంది కంప్యూటర్స్ ముందు పని చేస్తారు.అలా పనిచేసినప్పుడు కళ్ళు ఒత్తిళ్లకు గురువుతాయి.

అలాంటి సమయంలో కరివేపాకు ఆకులు నీటిలో వేసి ఆ ఆకులను కంటిపై పెట్టుకుంటే ఆ ఒత్తిడి తగ్గి కంటిచూపు కూడా మెరుగుపడుతుంది.

తాజా వార్తలు