ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనే క్లారిటీ ఎవ్వరికీ లేదు.ఏ పార్టీ ఎవరికీ సపోర్ట్ చేస్తుంది,ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడు ఇలా అంతా గందరగోళంగా తయారయ్యాయి ఏపీ రాజకీయాలు.
గత ఎన్నికలతో పోలిస్తే 2019 హై టెన్షన్ తీసుకువస్తున్నాయి.ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై స్పష్టత లేకపోయినా.
ఏపీలో పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నా యి.గత ఎన్నికల్లో ద్విముఖ పోటీ జరిగినా.ఈసారి మాత్రం త్రిముఖ పోటీ తప్పదని తెలుస్తోంది! టీడీపీ, వైసీపీకి తోడు జనసేన కూడా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.అయితే టిడీపి ని జనసేన ని వేరు వేరు గా ఎవ్వరు చూడటం లేదు.
రెండు పార్టీలో ఒక్కటే.పవన్ అప్పట్లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చేలా చేశాడు.
ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తూ తెలుగుదేశాన్ని ఈసారి కూడా అధికారంలో కూర్చోపెట్టాలనేది పవన్ బాబుల ప్లాన్ గా తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి.
సీట్ల విషయంలో టిడీపి అధినేత చంద్రాబాబు ఇప్పటికే జనసేన విషయంలో ఒక క్లారిటీ లో ఉన్నారట.సుమారు 35 నుంచి 45 వరకు ఇవ్వాలనేది బాబు మనోగతం.
టీడీపీ అధినేత చంద్రబాబు- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంత క్లోజ్ అనేది వేరే చెప్పవలసిన అవసరం లేదు రాజకీయ అవసరాల దృష్ట్యా పవన్ లేవనెత్తే ఎటువంటి పని అయినా సరే బాబు వెనువెంటనే ఆదేశాలతో వాటిని పూర్తీ చేయిస్తారు.ఈవిషయం ఏపీలో ఉండే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు.
ఇది రాజాకీయ ఎత్తుగడ అని.పార్టీ నేతలు పవన్‌పై విమర్శలు చేసినా.ఆ విమర్శలని ఖండిస్తూ.విమర్శలు చేసిన వారికి తలంటే కార్యక్రమం బాబు ఈ మధ్యన చాలానే చేశారు.ఈ విషయాలు చాలు వారి ఇరువురి మధ్య భందం ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది.
ఇదిలా ఉంటే .వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుందనే అంశంపై చర్చలు ఇప్పటినుంచే మొదలయ్యాయి.మొత్తం 175 నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతుందా లేక కేవలం కొన్ని నియోజకవర్గాలకే పరిమితమవుతుందా అనే సందేహం అందరిలోనూ ఉంది.
మొన్నామధ్య రెండు రాష్ట్రాలలో కలిపి 175 సీట్లలో జనసేన పోటీచేస్తుంది అని ట్వీట్ చేసి మళ్ళీ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయడం జరిగిందిదాంతో పవన్ అసలు ఎన్ని సీట్లలో పోటీచేస్తారు అనేది తానుగా బయటపెడితేనే కానీ తెలియని పరిస్థితి.అయితే టిడిపితో పొట్టు ఖాయం అయితే మాత్రం జనసేన 35 నుంచి 45 సీట్లకే పరిమితం అవుతుంది అనేది వాస్తవం.
అలాంటప్పుడు టిడీపి ఎమ్మెల్యేలలో ఎంతో మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు.కొత్తగా టికెట్ ఆశిస్తున్న నేతలు ఇలా వీళ్ళందరికీ టెన్షన్ స్టార్ట్ అయ్యినట్టే.
ఇప్పటికే చంద్రబాబు దగ్గర సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు.వారు ఆయా నియోజకవర్గ ప్రజల నుంచీ ఎదుర్కొంటున్న వ్యతిరేక విధానాలు అన్నీ లిస్టు ఉన్నాయట.
పవన్ కళ్యాణ్ కి ఇచ్చే సీట్లలో ఎక్కువశాతం సిట్టింగ్ లని పక్కకి నెట్టేసి ఆ సీట్లు కేటాయించే విధంగా ఉన్నారట.ఇప్పటికే ఈవిషయంలో సిట్టింగుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట.
అయితే జనసేనకు ఇచ్చే సీట్లలో ఎక్కువగా గుంటూరు, కృష్ణాలో కొన్ని ఈస్ట్, వెస్ట్, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.ఇక ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే ఒకటి లేదా రెండు చొప్పున తీసుకుని చిత్తూరు జిల్లాలో మాత్రం కాస్త ఎక్కువ సీట్లు అడగాలన్నదే జనసేన టార్గెట్‌గా తెలుస్తోంది.
ఎంపీ సీట్ల విషయంలో మాత్రం క్లారిటీ లేదు.అయితే గుంటూరు విజయవాడ లో ఒకటి మాత్రం తప్పక ఇవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ… అయితే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మరి జనసేనుడి తో జట్టుకట్టక తప్పే పరిస్థితి లేదు అనే కనిపిస్తోంది.
ఇప్పుడు చంద్రబాబు టెన్షన్ కూడా అదే.ఒకవేళ పవన్ కళ్యాణ్ మనకి సపోర్ట్ చేయకపోతే అది జగన్ కి చాలా ప్లస్ అవుతుంది సో ఎట్టిపరిస్థితుల్లో పవన్ సపోర్ట్ తోనే ముందుకు వెళ్ళాలి అనేది చంద్రబాబు ప్లాన్ మరి బాబు ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.