కొత్త అధ్యక్షుడికి తలనొప్పులు... అమెరికాలో కొత్తరకం కరోనా..!!

చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ దెబ్బకి ఎక్కువగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికా.

ఆ దేశం లో వైరస్ విజృంభించిన తీవ్రత బట్టి చూస్తే అప్పట్లో ప్రపంచ పటంలో అమెరికా దేశం కనుమరుగవడం గ్యారెంటీ అని అందరూ భావించారు.

అంతలా కరోనా అమెరికాని పగబట్టినట్లు విలయతాండవం సృష్టించింది.ప్రపంచ దేశాలలో ఎక్కువ కేసులు నమోదు కావడంతోపాటు ఎక్కువ మరణాలు కూడా అమెరికాలోనే అప్పట్లో సంభవించటం అంతర్జాతీయంగా అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది.

సైనిక పరంగా అదేవిధంగా టెక్నాలజీ పరంగా వైద్యరంగంలో అన్నిటిలో ముందుండే అమెరికా దేశమే ఈ వైరస్ ని ఎదుర్కోలేక పోతూ ఉంటే ఇక మిగతా దేశాల పరిస్థితి ఏంటి అనే వార్తలు కూడా అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో రావటం జరిగాయి.ఇదిలా ఉంటే ఇటీవల అమెరికాలో మరో కొత్త రకం కరోనా అనగా బ్రిటన్ దేశం లో బయటపడ్డ కరోనా స్ట్రెయిన్ కేసులు తాజాగాబయటపడినట్లు సమాచారం.ఇది బ్రిటన్ దేశం లో బయటపడ్డ కరోనా కంటే మరో కొత్త రకం స్ట్రెయిన్ అని అమెరికా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారట.

కేవలం కొద్దిపాటి టైం లోనే ఎక్కువ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ప్రస్తుతం అమెరికాలో పెరుగుతూ ఉండటంతో అమెరికా ప్రభుత్వం హడలెత్తి పోతుంది.మరికొద్ది రోజుల్లో కొత్త అధ్యక్షుడు జో బైడాన్ అధికార పగ్గాలు చేపట్టే సమయంలో అమెరికాలో ఈ పరిస్థితి దాపూరించడం తో .డెమోక్రాటిక్ పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారు.మరోపక్క అంతర్జాతీయస్థాయిలో అమెరికా కొత్త ప్రభుత్వం ఏ విధంగా ఈ కొత్తరకం వైరస్ ని హ్యాండిల్ చేస్తుంది అన్నది సస్పెన్స్ గా గమనిస్తోంది.

ఇదిలా ఉంటే మాస్కులు ధరించకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా ఈ వైరస్ ఖచ్చితంగా ఎటాక్ అవడం గ్యారెంటీ అని ప్రజలకు అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ కఠిన నిబంధనలు తీసుకుంటూ ఉంది.సరిగ్గా కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వచ్చాక ఈ కొత్త రకం కరోనా రావడంతో అమెరికా ప్రజలు తలపట్టుకుంటున్నారు.

Advertisement

 .

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు