చిరుతను టచ్ చేద్దామనుకున్నాడు.. ఊహించని షాక్ ఇవ్వడంతో కంగుతున్నాడు..?

పులి, చిరుతపులి, చిరుత, సింహం వంటి పిల్లి జాతి జంతువులు చాలా అందంగా కనిపించినప్పటికీ, వాటి ప్రవర్తన చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకోవడం చాలా ప్రమాదకరం.

పులులు అడవి జంతువులు, వాటికి స్వేచ్ఛ అవసరం.వాటి ప్రవర్తన ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు, మనపై దాడి చేయవచ్చు.

వాటి పంజాలు, దంతాలు చాలా పదునైనవి, అవి తీవ్రంగా గాయపరచగలవు లేదంటే చంపేయగలవు.ఈ విషయం తెలిసినా లేకపోతే తెలియక చాలామంది వాటి జోలికి వెళ్తుంటారు చివరికి గాయాలు పాలయ్యి పశ్చాత్తాప పడుతుంటారు.

తాజాగా, ఒక వ్యక్తి ఓ పెంపుడు చిరుతపులి( Leopard )ని టచ్ చేద్దామనుకున్నాడు.అయితే అది ఊహించని విధంగా దాడి చేయడంతో సదరు వ్యక్తి షాక్ తిన్నాడు.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సంఘటన మరోసారి వన్యప్రాణులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెబుతోంది.

వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో చిరుతపులిని చేతులతో తాకుతూ పెంపుడు జంతువులా ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది.కానీ, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆ చిరుతపులి అతనిపై దాడి చేస్తుంది.వీడియో ఓపెన్ చేయగానే మనకు ఇద్దరు వ్యక్తులు ఒక సోఫాపై కూర్చోని ఉండటం కనిపిస్తుంది, వారి మధ్యలో చిరుతపులి కూర్చుని ఉంటుంది.చిరుత ఒక పెంపుడు జంతువులా వినయంగా, అమాయకంగా కనిపిస్తుంది.

కానీ, ఒక్కసారిగా, ఆ చిరుతపులి ఒక వ్యక్తిపై దాడి చేసి గర్జిస్తుంది.ఆశ్చర్యంతో ఆ వ్యక్తి లేచి నిలబడి పులిని వింతగా చూస్తాడు.

తరువాత, ఆ వ్యక్తి తనకు చిరుతపులి ఎక్కడ కొరికిందో చూపిస్తాడు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

ఈ లెపార్డ్ అటాక్ వీడియో సోషల్ మీడియా( Social media)లో చర్చనీయాంశమైంది.చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ, వన్యప్రాణులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం ఎంత ప్రమాదకరమో తెలియజేశారు."అతను చాలా అదృష్టవంతుడు.

Advertisement

అది పీక కొరకలేదు.ఇది అడవి జంతువు.

పెంపుడు జంతువు కాదు.జంతువులను గౌరవించండి!! చిరుతపులి ఒక అడవి జంతువు, దానిని పెంపుడు జంతువుగా పెంచుకోవడం చాలా ప్రమాదకరం.

వన్యప్రాణులను ఎప్పుడూ పెంపుడు జంతువులుగా పెంచుకోకూడదు." అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు.

తాజా వార్తలు