Harirama Jogaiah Pawan Kalyan : బాబుకే పట్టం కడితే ఎలా..? పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య ఘాటు లేఖాస్త్రం..!!

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య( Former Minister Harirama Jogaiah ) మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖాస్త్రాన్ని సంధించారు.

పొత్తుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును గద్దెను ఎక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) వెంట కాపులు నడవడం లేదని తేల్చి చెప్పారు.పొత్తులు పెట్టుకున్నా సీట్లు కూడా సాధించలేని జనసేనాని రేపు రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కాపాడతావంటూ ఆయన లేఖలో ఘాటుగా విమర్శలు చేశారు.

Harirama Jogaiah Letter To Pawan Kalyan About Seat Sharing

టీడీపీ - జనసేన( TDP-Janasena ) సీట్ల సర్దుబాటు వ్యవహారంపై అంటూ ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే పలుమార్లు కీలక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సమావేశాల్లో ఏ అంశాలను చర్చించారు.? సీట్ల సర్దుబాటు ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశాలపై చర్చ జరిగిందని, ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu Naidu ), పవన్ కల్యాణ్ కు క్లారిటీ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.మరోవైపు జనసేనకు 30 సీట్లని, కాదు 27 సీట్లు అంటూ పలు కథనాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.

దీంతో ఈ విషయాన్ని హరిరామ జోగయ్య లేఖ( Harirama Jogaiah Letter )లో పేర్కొన్నారు.ఈ రకమైన వార్తలను పార్టీ శ్రేణులు గ్రహించాలని ఆయన తెలిపారు.

Advertisement
Harirama Jogaiah Letter To Pawan Kalyan About Seat Sharing-Harirama Jogaiah Paw

వైసీపీని గద్దె దించడం అంటే టీడీపీకి( TDP ) అధికారం కట్టబెట్టడం కాదని హరిరామజోగయ్య లేఖలో ప్రస్తావించారు.పవన్ కల్యాణ్ తో కలిసి కాపు సామాజిక వర్గం ప్రయాణం చేస్తున్నది ఈ ఆలోచనలో కాదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

జనసేన మద్ధతు లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టతరమన్న ఆయన ఇందుకు గత ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు.

Harirama Jogaiah Letter To Pawan Kalyan About Seat Sharing

రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన కనీసం నలభై నుంచి ఆరవై స్థానాల్లోనైనా పోటీ చేయగలిగితేనే అధికారం సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య సూచించారు.అలాగే సుమారు యాభై స్థానాల్లో విజయాన్ని అందుకోవాలన్నారు.అంతేకానీ ఈ అవకాశాన్ని, అధికారాన్ని టీడీపీ ధారాదత్తం చేస్తే జనసేన కలలు ఏ విధంగా సాకారం అవుతాయి.? జనసేనాని కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యం అవుతాయని ప్రశ్నలు సంధించారు.

జనసేన నేతలు, జన సైనికులు( Janasena Activists ) సంతృప్తి చెందేలా సీట్ల పంపకాలు జరగకపోయినప్పటికీ.కనీసం రెండున్నర సంవత్సరాలైనా సీఎం పదవి కట్టబెడతానని చంద్రబాబు ప్రకటించగలరా? అని పవన్ కల్యాణ్ ను నిలదీశారు.కాపు సామాజిక వర్గానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులు ఉన్నా సీట్ల పంపకం సరిగా జరగకపోతే.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 

అనుకున్న విజయాన్ని సాధించలేరని, దానికి కారణం మీరే అవుతారంటూ పవన్ కు హరిరామ జోగయ్య లేఖను రాశారు.ప్రస్తుతం హరిరామ జోగయ్య రాసిన లేఖ జన సైనికులతో పాటు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు