కుర్చీ మడతబెట్టి సాంగ్ తో మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్.. బాబుకు తిరుగులేదుగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) శ్రీ లీల( Sreeleela ) కలిసి నటించిన గుంటూరు కారం.

( Guntur Kaaram ) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 270 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి.మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి( Kurchi Madatha Petti Song ) అనే సాంగ్ బాగా వైరల్ అయింది.

అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

ఒక్క యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు ఈ పాటు మారు మోగిపోయింది.కుర్చీ మడతబెట్టి అనే ఒక వైరల్ పదం తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా థమన్( Thaman ) ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్, శ్రీలీల, మహేష్ సినిమాలో వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.థియేటర్స్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

Advertisement

ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ ను అందుకుంది.

తెలుగు నుంచి ఫాస్టెస్ట్ 100 మిలియన్ నుంచి 200 మిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్స్ లో ఒకటిగా అదిరే రెస్పాన్స్ తో దూసుకెళ్లగా ఇప్పుడు 2 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి మహేష్ ఖాతాలో ఇంకో రికార్డ్ అందించింది.ఇక దీనితో పాటుగా సాంగ్ ఇప్పుడు 300 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తూ అన్ స్టాపబుల్ గా ఉందని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు