చెరుకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. ఉత్తరాంధ్ర చర్చావేదిక లో జె.డి లక్ష్మీ నారాయణ

విశాఖ: రైతులు పొలంలో ఉండాలి రోడ్ల పై ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ ఉత్తరాంధ్ర చర్చావేదిక. ప్రభుత్వం అదుకోకపోతే చెరుకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యం.

ఎస్.రాయవరం మండలం ఏటికొప్పాక చక్కెర కర్మాగారం 1932 లో ఆసియా ఖండంలో మొట్ట మొదటి కర్మాగారం మూతపడకూడదన్న జె.డి లక్ష్మీ నారాయణ.

ఏటికొప్పాక చక్కెర కర్మాగారంకు చెరుకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు కనీస బ్యాంక్ వడ్డీతో సహా చెల్లించాలి.కార్మికుల కు 16 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి.

ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ని అడునికరించి క్రషింగ్ చేయుటకు కర్మాగారం ను సిద్ధం చేయాలి.ఏటికొప్పాక చక్కెర కర్మాగారం లో 22 కోట్ల బకాయిలు ఉన్నాయి.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లిస్తే కర్మాగారం, రైతుల,కార్మికుల సమస్యలు పరిష్కరించ బడతాయి.ఈ రైతు, కార్మిక సమస్యల పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, షుగర్ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలి.

దేశ ప్రగతి కోసం ప్రధాని మోడీ సైతం మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాదాన్ని గుర్తు చేశారు.మేము ప్రజల నోరు తీపి చేస్తున్నాం, మా నోరు ఎప్పుడు తీపి చేస్తారని రైతులు నుండి ఆవేదన.

రైతు బాగుంటేనే ప్రజా సంక్షేమం బాగుంటుంది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు