రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మరో 10 సమ్మర్ స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే!

అవును, భారతీయ రైల్వే( Indian Railways ) తమ ప్రయాణికులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

వేసవి కాలం దృష్ట్యా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో ప్రత్యేక రైళ్లు నడిపనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.విశాఖపట్నం, పాట్నా, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలకు 6,369 ట్రిప్పులతో ఈ ట్రైన్స్ నడవనున్నాయని తెలుస్తోంది.

ఇక గతేడాది సమ్మర్ సీజన్‌లో 348 ప్రత్యేక రైళ్లతో 4,599 ట్రిప్పులను నడపగా.ఈ ఏడాది అదనంగా 1,770 ఎక్కువ ట్రిప్పులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది మన రెయిల్వేశాఖ.

Good News For Railway Passengers 10 More Summer Special Trains Details, Special

గత వేసవిలో అయితే ఒక్కో రైలుకు సగటున 13.2 ట్రిప్పులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్య 16.8గా ఉంటుందని రైల్వే అధికారులు( Railway officials ) తెలపడం గమనార్హం.కాగా ఈ ట్రైన్స్ విశాఖపట్నం -పూరీ- హౌరా, పాట్నా - సికింద్రాబాద్, ముంబై- పాట్నా, పాట్నా - యశ్వంత్‌పూర్, ఢిల్లీ - పాట్నా, బరౌనీ - ముజఫర్‌పూర్, ఢిల్లీ - కత్రా, చండీగఢ్ -గోరఖ్‌పూర్, ఆనంద్ ఫ్వి కో హార్ -పాట్నా, ముంబై-గోరఖ్‌పూర్ మధ్య నడవనున్నట్టుగా తెలుస్తోంది.

Good News For Railway Passengers 10 More Summer Special Trains Details, Special
Advertisement
Good News For Railway Passengers 10 More Summer Special Trains Details, Special

ట్రైన్ నంబర్ - 07435 కాచిగూడ-నాగర్‌కోయిల్( Kachiguda-Nagarkoil ) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 26, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.అదేవిధంగా ట్రైన్ నంబర్ - 07436 నాగర్‌కోయిల్ -కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది.కాగా ఈ ట్రైన్లు మల్కాజ్ గిరి, మిర్యాలగూడ, నల్గొండ, నడికుడి, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, బాపట్ల, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, ఒంగోలు, వెల్లూరు, శ్రీరంగం, మధురై తదితర స్టేషన్లలో ఆగుతాయి.

నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...
Advertisement

తాజా వార్తలు