పోలీసు శాఖలో మంచి మనసున్న మనిషి...!!

నల్లగొండ జిల్లా:జాతీయ కబడ్డీ క్రీడాకారుడికి కోచింగ్ సమయంలో లెగ్మెంట్ కి గాయమైంది.

ఈ విషయం తెలుసుకున్న నల్లగొండ జిల్లా హలియా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దగ్గుల క్రాంతి కుమార్ వెంటనే స్పందించారు.

హాలియా టౌన్ కి చెందిన జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు జె.సందీప్ గత చరిత్ర తెలుసుకొని, అతని సర్జరీ నిమిత్తం తన రెండు నెలల జీతం రూ.1,60,522 విరాళంగా ప్రకటించి పోలీసు శాఖలో మనసున్న మంచి మనిషిగా నిలిచారు.హాలియా మున్సిపాలిటీకి చెందిన జె.సందీప్ రాష్ట్ర స్థాయిలో ఆరుసార్లు ఉత్తమ ప్లేయర్ గా,8 సార్లు నేషనల్స్ ఖేలో ఇండియా విభాగానికి ఎంపికయ్యారు.కొద్ది నెలల క్రితం హర్యానాలో జరిగిన ఇండియా కబడ్డీ మాజీ కెప్టెన్ అనూప్ కుమార్ యాదవ్ కోచింగ్ క్యాంప్ లో లెగ్మెంట్ కిగాయమైంది.

హలియా ఎస్ఐ క్రాంతి కుమార్ కామినేని హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి అతనికి బెస్ట్ ట్రీట్మెంట్ చేయిస్తుండడంతో సందీప్ తల్లిదండ్రులు,క్రీడాకారులు,పట్టణ ప్రజలు ఎస్ఐ క్రాంతి కుమార్ పే బ్యాక్ టు సొసైటీకి ఫిదా అయి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు