మహా గౌరీ అవతారంలో దుర్గామాత

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మహాగౌరీ అవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం స్థానాచార్యులు అప్పాల బీమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి చతుషష్టి పూజలు నిర్వహించారు.

నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపం, చండీ హోమం, గాయత్రి హవనాన్ని వేదమంత్రాలతో నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి వద్ద దుర్గాష్టమి సందర్భంగా శ్రీ చండీ కలశ ప్రతిష్ట, చండీ హవన కార్యక్రమాలు జరిగాయి.

రాత్రి మహిషాసుర మర్దిని అమ్మవారికి మహా పూజ జరుగుతుంది.

మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
Advertisement

Latest Rajanna Sircilla News