అమెరికా: మిస్సౌరీ సిటి కౌన్సిల్ ఎన్నికల్లో హైదరాబాద్ టెక్కీ ఘన విజయం

అమెరికన్ రాజకీయాల్లో భారతీయులు దూసుకుపోతున్నారు.ఏ ఎన్నికలు జరిగినా మనవారి హవా వుండాల్సిందే.

సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, మేయర్లుగా, గవర్నర్లుగా భారతీయులు ఎన్నికవుతున్నారు.తాజాగా మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌ సిటీ కౌన్సిల్‌కు భారత సంతతికి చెందిన టెక్కీ గిరిధర్ శ్రీపెరంబుదూర్ ఎన్నికయ్యారు.

Giridhar Sriperumbudur Was Elected To Chesterfield City Council, Missouri, India

సిటీ కౌన్సిల్‌లోని వార్డ్ IV నుంచి ఆయన గెలుపొందారు.ఈ నెల 21న జరిగిన కార్యక్రమంలో గిరిధర్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తాను కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలో వుంటూ ఓటర్లతో సన్నిహితంగా వున్నట్లు వెల్లడించారు.

Advertisement

ఈ వార్డ్ నుంచి ఆయనతో పాటు నలుగురు పోటీ చేయగా.గిరిధర్‌ను విజయం వరించింది.

గిరిధర్ శ్రీపెరంబుదూర్‌ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో పెరిగారు.హైదరాబాద్‌లోని ప్రిన్స్‌టన్ కాలేజ్ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయన 1998లో అమెరికా వెళ్లారు.న్యూయార్క్, కాలిఫోర్నియాతో పాటు పలు నగరాల్లో నివసించారు.2004 నుంచి మిస్సౌరీలోని సెయింట్ లాయిస్‌ను గిరిధర్ తన స్థిరనివాసంగా మార్చుకున్నారు.ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ హైదరాబాద్‌లోని నిజాంపేటలో నివసిస్తున్నారు.

సిటీ కౌన్సిల్‌కు ఎన్నికవడం ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని.ప్రజాధనాన్ని సరైన పనుల కోసం ఖర్చు చేసేలా చూస్తానని గిరిధర్ వెల్లడించారు.

అవసరాలు, ప్రాధాన్యతలను తెలుసుకుంటూ, ప్రజలకు సేవ చేసేందుకు తాను కౌన్సిల్‌కు సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా గిరిధర్ ఆయన బృందం కౌన్సిల్ పరిధిలోని సుమారు 1,700 ఇళ్లను చుట్టింది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తనకు ఓటర్‌తో మమేకవ్వడం కష్టం కాదని, గతంలో ఐదేళ్ల పాటు ఓ ఎన్జీవోకు డైరెక్టర్‌గా వ్యవహరించానని ఆయన గుర్తుచేశారు.గిరిధర్ చేస్తున్న సేవలకు గాను 2019లో మిస్సౌరీ గవర్నర్ మైఖేల్ ఎల్ పార్సన్‌ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు.

Advertisement

ఏడాదిలో 500 గంటల పాటు సామాజిక సేవను పూర్తి చేసినందుకు గాను మూడు సార్లు ప్రిసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ గోల్డ్ అవార్డును అందుకున్నారు గిరిధర్.హైదరాబాద్‌తో తనకు విడదీయరాని అనుబంధం వుందన్న గిరిధర్.

ప్రస్తుత కోవిడ్ పరిస్ధితి కారణంగా తాను భారత్‌కు వెళ్లలేనని తెలిపారు.కానీ హైదరాబాద్ వెళ్లేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు గిరిధర్ వెల్లడించారు.

తాజా వార్తలు