క‌రోనాను క‌ట్ట‌డి చేస్తున్న మౌత్‌వాష్.. బ‌య‌ట‌ప‌డ్డ కొత్త విష‌యాలు!

క‌రోనా వైర‌స్‌.ప్ర‌పంచ‌దేశాల్లో ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది.

చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ అగ్ర‌రాజ్యాల‌ను సైతం అత‌లాకుత‌లం చేస్తోంది.

మాన‌వ మ‌నుగ‌డ‌కే పెద్ద ముప్పుగా మారిన క‌రోనా వైర‌స్‌.

ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వ‌రికీ అంతుచిక్క‌డం లేదు.మ‌రోవైపు ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు ఈ క‌రోనా భూతాన్ని మ‌ట్టు పెట్టే వ్యాక్సిన్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే వంద‌ల ప‌రిశోధ‌న‌లు చేస్తున్నా.ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్ రాలేదు.

Advertisement

దీంతో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.రోజులు త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినా.

క‌రోనా మాత్రం అదుపులోకి రాలేదు.అయితే ఇలాంటి త‌రుణంలో క‌రోనా గురించి రోజుకో కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది.

తాజాగా జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో.మౌత్‌వాష్‌లతో పుక్కలిస్తే నోరు, గొంతులోని ప్రాణాంతక కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతోందని తేలింది.

త‌ద్వారా ఇతరులకు కరోనా సంక్రమించే అవకాశం తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.అయితే మౌత్‌వాష్ యూజ్ చేసి కరోనాను నయం చేయడం సాధ్యం కాదని స్ప‌ష్టం చేశారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!

వాస్త‌వానికి క‌రోనా సోకిన వారిలో గొంతు, కావిటీల్లో అత్యధిక మొత్తంలో వైర‌స్ లోడ్ అయ్యి ఉంటుంది.అయితే ఎప్పుడైతే ద‌గ్గ‌డ‌మో లేదా ముక్కు చీదడమో లేదా శ్వాస వదిలినప్పుడో ఈ వైరస్‌ బయటకు వస్తోంది.

Advertisement

అప్పుడు ఇది ఇత‌రుల‌కు వ్యాప్తిచెందుతుంది.అయితే మౌత్‌వాష్‌లతో నోటిని పుక్కలించడం వల్ల‌ వైరస్‌ కణాల సంఖ్య తగ్గి సంక్రమణకు అవకాశాలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ముప్పై సెకన్ల పుక్కిలింత తరువాత వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

తాజా వార్తలు