భవిష్యత్ సంస్కరణలు తీసుకురానున్నాం..: నిర్మలా సీతారామన్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు( Parliament Budget Sessions ) కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Central Finance Minister Nirmala Sitharaman ) డిజిటల్ విధానంలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

వచ్చే ఐదేళ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతుందని, ఈ క్రమంలో స్వర్ణయుగం కానుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.భవిష్యత్ సంస్కరణలు తీసుకురానున్నామన్నారు.

రాష్ట్రాల్లోనే కాకుండా జిల్లాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో( Rural Areas ) మూడు కోట్ల గృహ నిర్మాణాన్ని సాధించామన్నారు.

వచ్చే రెండేళ్లలో మరో రెండు కోట్ల గృహ నిర్మాణాలు అందిస్తామని చెప్పారు.కోటి ఇళ్లలో సౌర విద్యుత్( Solar Energy ) ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

Advertisement

మధ్య తరగతి ప్రజలు సొంత నివాసం నిర్మించుకునేందుకు సాయం అందిస్తామన్న నిర్మలా సీతారామన్ 9 నుంచి 14 లోపు బాలికలకు వ్యాక్సినేషన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.నానో యూరియా విజయవంతం కావడంతో నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు