వైట్‌హౌస్‌లో కరోనా కలకలం.. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ ఎటాక్, సిబ్బందిలో ఆందోళన

అమెరికాలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది.ఇప్పటికే థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తోందంటూ అక్కడి నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా డెల్టా వేరియంట్ బాగా విజృంభిస్తోంది.వారం రోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

జులై మొదటివారం నుంచి దాదాపు 50 శాతం మేర కేసులు పెరిగాయి.డెల్టా వేరియంట్ వల్ల 83 శాతం మేర కొత్త కేసులు నమోదవుతున్నాయని యూఎస్ సీడీసీ వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ అగ్రరాజ్యం విజ్ఞప్తి చేస్తోంది.మరోవైపు ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,50,81,719లకు చేరగా.6,25,363 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది.

Advertisement

వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ అధికారులకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.ఈ మేరకు మంగళవారం వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి ఒక ప్రకటన విడుదల చేశారు.

అధ్యక్ష భవనంలోని దిగువ స్థాయి అధికారులలో కొంతమందికి సోమవారం కరోనా పాటిజివ్‌గా తేలిందని జెన్ సాకీ పేర్కొన్నారు.ఆ అధికారుల్లో కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.

అయితే, ఎంతమంది అధికారులకు పాజిటివ్‌గా వచ్చిందనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు.అలాగే వారికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని కూడా చెప్పలేదు.

కాగా, వైరస్ సోకిన అధికారులు అధ్యక్షుడు బైడెన్‌తో గానీ, ఇటు ఉన్నత స్థాయి అధికారులతో గానీ సన్నిహితంగా మెలగలేదని జెన్ సాకి స్పష్టం చేశారు.ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వీరితో కాంటాక్ట్ అయిన వారిని కూడా గుర్తించి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.టెక్సాస్‌లో నిర్వహించిన రూఫ్‌టాప్‌ రిసెప్షన్‌కు హాజరైన తరువాతే ఆ అధికారులు వైరస్‌ బారిన పడినట్లుగా భావిస్తున్నామని జెన్ సాకీ అన్నారు.

Advertisement

కాగా, టెక్సాస్‌ రూఫ్‌టాప్‌ రిసెప్షన్‌కు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా హాజరైనట్లు సమాచారం.ఆమెతో పాటు డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన పలువురు ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.ఇప్పటికే స్పీకర్‌ న్యాన్సీ పెలోసీ సిబ్బంది, వైట్‌హౌస్‌ అధికారులతో పాటు ఈ రిసెప్షన్‌లో పాల్గన్న ఆరుగురు డెమోక్రాట్లకు కరోనా నిర్థారణ అయ్యింది.

ఈ రిసెప్షన్‌కు హాజరైన ఒక నర్సుకు కూడా వైరస్‌ సోకినట్లుగా అమెరికన్ మీడియా కథనాలు ప్రచురించింది.వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

తాజా వార్తలు