వీర్యకణాల సైజు, జీవితకాలం .. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన నిజాలు

పురుషుడి వీర్యం.సృష్టికి మూలాధారం.

ఎంత తోడినా తరగని సంపద.

తనకి తానూగా పురుషుడు ఉత్పత్తి పాడు చేసుకుంటే తప్ప, వీర్య ఉత్పత్తి ఆగిపోదు.

From Size To Lifespan .. Facts About Sperm You Should Know-From Size To Lifespan

అందుకే దీన్ని మగసిరి అని అంటారు.ఈ వీర్యం గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి.

వాటిలో కొన్ని మీకోసం.* పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వీర్యకణంలో మూడు భాగాలు ఉంటాయి.

Advertisement

అవి తల, మధ్యభాగం మరియు తోక.అదే వీర్యంలో లోపాలు ఉన్నాయి అనుకోండి, మెడ వంగి ఉండవచు, రెండు తలలు ఉండవచ్చు, రెండేసి తలలు కూడా ఉండవచ్చు.* ఒక వీర్యకణం .0002 అంగుళాల పొడవు ఉంటుంది.అంటే 50 మైక్రోమీటర్ల దాకా ఉంటుంది అన్నమాట.

ఇలాంటి వీర్యకణాలు వీర్యంలో మిలియన్లకొద్ది ఉంటాయి.* వీర్యం యొక్క ఉత్పత్తి పురుషుల వృషనాల్లో అవుతుంది.

సెకనుకి దాదాపుగా 1500 వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి.ఇవి ప్రాణాలతో ఎక్కువకాలం ఉండవు.

కాబట్టి హస్తప్రయోగం లేదా శృంగారం ద్వారా ఎప్పటికప్పుడు బయటకి తీయడంలో తప్పు లేదు.* ఆశ్చర్యం కలిగించే విషయం అయినా, ఒక్కో వీర్యకణం పరిపక్వత అంటే మ్యేచురిటి సాధించడానికి రెండున్నర నుంచి మూడు నెలల సమయం పడుతుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
కేరళలో నిఫా వైరస్.. రంగంలోకి కేంద్ర బృందం

అయినా పురుషుడిలో రోజుకి కావాల్సినంత వీర్యం పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.* వీర్యకణాలు ఈత కొడుతాయి అని మనకు తెలుసు.

Advertisement

ఇవి నిమిషానికి 5 మిల్లిమీటర్ల వేగంతో ఈత కొడుతూ 45 నిమిషాల నుంచి గంటలో స్త్రీ యొక్క బీజవాహికలను చేరుకుంటాయి.అయితే అన్ని వీర్యకాణాలు అదే వేగంతో ప్రయాణించలేవు.

కొన్ని 10 గంటలకు పైగా సమయం తీసుకుంటాయి.* స్త్రీ శరీరంలో వీర్యకణాలు మూడు నుంచి అయిదు రోజుల వరకు బ్రతకగలవు.

అంటే స్త్రీ గర్భం దాల్చడానికి ఒక్కోసారి వీర్యం అయిదు రోజుల పాటు అక్కడే బ్రతికి ఉంటుందన్నమాట.* X క్రోమోజోం కలిగిన వీర్యకణం అండాన్ని చేరితే ఆడశిశువు జన్మిస్తుంది.

అదే y క్రోమోజోం ఉన్న వీర్యకణం చేరితే మగపిల్లాడు జన్మిస్తాడు.

తాజా వార్తలు