మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తే ఆత్మహత్య!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి, బూర్గంపాడు మండలం సారపకలోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవర్మరణనికి పాల్పడింది! ఉరివేసుకుని వేలాడుతూ కనిపించిన మహాలక్ష్మిని చూసి కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే మహాలక్ష్మి మృతి చెందిందని డాక్టర్లు దృవీకరించడంతో మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహాలక్ష్మి ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇలా బలవన్మరణానికి పాల్పడటం తో కుటుంబంలో విషాదం నెలకొంది.

విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు తాటి వెంకటేశ్వర్లకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Latest Bhadradri Kothagudem News