భద్రాచలంలోని పారామెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పారా మెడికల్ కాలేజీ ( Paramedical College )వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నిన్న సాయంత్రం చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య బంధువులు కాలేజీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 There Is Intense Tension At The Paramedical College In Bhadrachalam , Bhadracha-TeluguStop.com

విద్యార్థిని కారుణ్య( karunya ) మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే నిరసననకారులు కాలేజీ ఛైర్మన్ పై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కాలేజీ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే నిన్న కళాశాలలో అపస్మారక స్థితిలో విద్యార్థిని కారుణ్యను గుర్తించిన సంగతి తెలిసిందే.

కాలేజీ ప్రాంగణంలో కారుణ్య గాయాలతో పడి ఉంది.ఈ క్రమంలో కారుణ్యను గుర్తించిన సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.

చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య మృతిచెందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube