భద్రాచలంలోని పారామెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పారా మెడికల్ కాలేజీ ( Paramedical College )వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నిన్న సాయంత్రం చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య బంధువులు కాలేజీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

విద్యార్థిని కారుణ్య( Karunya ) మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే నిరసననకారులు కాలేజీ ఛైర్మన్ పై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కాలేజీ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే నిన్న కళాశాలలో అపస్మారక స్థితిలో విద్యార్థిని కారుణ్యను గుర్తించిన సంగతి తెలిసిందే.

కాలేజీ ప్రాంగణంలో కారుణ్య గాయాలతో పడి ఉంది.ఈ క్రమంలో కారుణ్యను గుర్తించిన సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.

చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య మృతిచెందింది.

షాకింగ్ వీడియో: కనురెప్ప పాటులో తల్లిబిడ్డలను పొట్టన పెట్టుకున్న కారు..