న్యూ ఇయర్ పార్టీలో అందంగా మెరిసిపోవాలని ఉందా? అయితే ఈ రెమెడీ మీ కోసమే!

మరో నాలుగు రోజుల్లోనే న్యూ ఇయర్ రాబోతోంది.పాత సంవత్సరానికి బై బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాము.

న్యూ ఇయర్ అంటే హంగామా ఈ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ఎక్కడికక్కడ పార్టీలు వేరే లెవెల్ లో జరుగుతుంటాయి.

అయితే న్యూ ఇయర్ పార్టీ లో అందరికంటే తామే అందంగా మెరిసిపోవాలని కోరిక చాలా మందికి ఉంటుంది.ఈ లిస్టులో మీరు కనుక ఉంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటించాల్సిందే.

ఈ రెమెడీ మీ చర్మాన్ని అందంగా మరియు కాంతివంతంగా మెరిపించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Advertisement
Follow This Remedy To Get A Glowing Face At The New Year Party New Year Party, N

ముందుగా ఒక మీడియం సైజ్ బీట్ రూట్ ను తీసుకుని పీల్‌ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్‌ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, గుప్పెడు ఫ్రెష్ గులాబీ రేకులు, ఒక కప్పు వాట‌ర్‌ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు పొడి.

వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత అందులో సరిపడా బీట్ రూట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Follow This Remedy To Get A Glowing Face At The New Year Party New Year Party, N

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని రోజుకు ఒకసారి కనుక పాటిస్తే చర్మం కాంతివంతంగా షైనీగా మారుతుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

చర్మం పై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి.న్యూ ఇయర్ పార్టీలో చర్మం అందంగా మెరిసిపోతుంది.

Advertisement

కాబ‌ట్టి, తప్పకుండా ఈ రెమెడీని ఇప్పటినుంచే పాటించేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు