ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.రేపు కందుకూరులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపూ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది.టీడీపీ ఇంఛార్జ్ నాగేశ్వర రావు, టీడీపీ నేత రాజేశ్ వర్గాలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
రాజేశ్ వర్గం ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించిన నాగేశ్వర రావు వర్గీయులు తమ ప్లెక్సీలను పెట్టేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.







