ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ కారు మతిపోగొట్టే ఫీచర్లు..ఒక్కసారి చార్జింగ్ తో 700కి.మీ..!

ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ కారు( Fisker Ocean Electric Car ) మతిపోగొట్టే ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

కేవలం ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఎక్కువ రేంజ్ అనేది ఈ ఫిస్కర్ ఓషన్ కారు ప్రత్యేకత.అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫిష్కర్ తాజాగా భారత మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

ఫిష్కర్ కంపెనీకి చెందిన ఫిష్కర్ ఓషన్ మోడల్ ( Fishers Ocean Model )ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.సెప్టెంబర్ లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో స్పోర్ట్, అల్ట్రా, ఎక్స్ ట్రీమ్ అనే మూడు వేరియంట్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

Advertisement

ఈ ఫిష్కర్ ఓషన్ ఫీచర్ల విషయానికి వస్తే.ఈ కారులో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి.బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 113 కేడబ్ల్యూహెచ్( battery pack capacity is 113 kWh ) గా ఉంది.

ఇందులో ప్రత్యేకంగా డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉంటుంది.ఇక దీని టార్క్ 736 ఎన్గా, పవర్ 564 పీఎస్ గా ఉంది.ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే కేవలం నాలుగు సెకండ్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అంతేకాకుండా ఈ కారులో సోలార్ ప్యానల్ రూఫ్ కూడా ఉంది.దీనివల్ల బ్యాటరీ చార్జ్ అవుతుంది.

ఈ ప్యానల్ కారుకు ఉండడం వల్ల ఒక ఏడాదికి రెండు వేల కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయవచ్చు.వీటితో పాటు 3డీ సరౌండ్ సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ ఫిష్కర్ ఓషన్ కారు ధర విషయానికి వస్తే రూ.65 లక్షలు గా ఉండే అవకాశం ఉంది.భారత మార్కెట్లో ఈ కారు ధర ఏకంగా రూ.కోటి రూపాయలు ఉండే అవకాశం ఉంది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు