హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పేలుడు కలకలం..!

హైదరాబాద్ లోని గాంధీనగర్ లో పేలుడు కలకలం సృష్టించింది.లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డులో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో నటించిన స్టార్ హీరో ఈయన ఒక్కడేనా..?
Advertisement

తాజా వార్తలు