బిగ్ బాస్ షో సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు మరో 72 గంటల సమయం మాత్రమే ఉండగా శ్రీసత్యను మిడ్ వీక్ ఎలిమినేట్ చేయనున్నారనే వార్త ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది.బిగ్ బాస్ షోలో ఓటింగ్ తీసేస్తే బెటర్ అని ప్రేక్షకుల అభిప్రాయాలకు విలువ లేని ఓటింగ్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జునకు కూడా విరక్తి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.
తాను ఎంత కష్టపడినా సోషల్ మీడియాలో నెగిటివ్ గానే కామెంట్లు వస్తుండటం నాగార్జునను ఎంతగానో హర్ట్ చేసిందని సమాచారం అందుతోంది.
అందువల్లే ఎంత ఆఫర్ చేసినా వచ్చే సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనని చెప్పారని బోగట్టా.దీంతో బిగ్ బాస్ షో హోస్ట్ గా ఈ షో నిర్వాహకులు బాలయ్యను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.
బాలయ్య ఈ షోకు హోస్ట్ గా చేస్తే మాత్రం మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తే ఈ షోకు కూడా కొత్తదనం వస్తుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తానని చెబితే నాగార్జునకు మించి బాలయ్యకు పారితోషికం ఇవ్వడానికి ఈ షో నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు.ఈ షో విషయంలో ఎన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
బాలయ్య ఏ షోలోకి ఎంట్రీ ఇచ్చినా దబిడి దిబిడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం బాలయ్యకు పరిస్థితులు సైతం అనుకూలంగా ఉన్నాయని ఆయన ఏం చేసినా సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అన్ స్టాపబుల్ షోతో రేంజ్ మార్చుకున్న బాలయ్య బిగ్ బాస్ షోతో తన స్థాయి మరింత పెంచుకోవడం గ్యారంటీ అని కొంతమంది చెబుతున్నారు.