పోరాటాలకు ప్రతి గ్రామం ఉద్యమ కేంద్రం కావాలి:- శ్రేణులకు సీపీఐ పార్టీ పిలుపు

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రతి గ్రామం ఉద్యమ కేంద్రం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు అన్నారు.

మధిర మండల పరిధిలోని మడుపల్లి సిపిఐ గ్రామ మహాసభ పంగ శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వలన లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని,పెట్టుబడిదారీ వర్గాలు వారి లాభాల కోసం పనిచేశాయని, అమెరికా లాంటి పెట్టుబడి దారీ దేశాలు కూడా కరోనా కట్టడి చేయడంలో విఫలం అయినాయని అన్నారు.కానీ ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు అధికారంలో ఉన్న దేశాలు కరోనా వ్యాధిని అరికట్టడంలో అగ్రస్థానంలో ఉన్నాయని, భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో విఫలం అయినాయని అన్నారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల సొమ్మును పెద్దలకు దోచి పెట్టిందన్నారు.గ్రామాల్లో పార్టీ బలోపేతం కావాలన్నారు అందుకు పార్టీ సభ్యులు అంకిత భావంతో పని చేయాలని తెలిపారు.

అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా శిలువేరు శ్రీనివాసరావు,సహాయ కార్యదర్శిలుగా జిల్లా బ్రహ్మం,అన్నవరపు సత్యనారాయణని ఎన్నుకున్నారు.మహాసభ ప్రారంభించడానికి ముందు పార్టీ జెండాను సీనియర్‌ నాయకురాలు నల్లబోతు రత్తమ్మ ఆవిష్కరించారు.

Advertisement

అనంతరం మా సభా వేదిక సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 21న అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు ప్రధమ వర్ధంతి ని మల్లవరం గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని కార్యకర్తలు సానుభూతిపరులు ఈ వర్ధంతి కి హాజరుకావాలని తెలిపారు.ఈ మహాసభలో రైతు సంఘం జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి మందడపు రాణి,సిపిఐ మండల పట్టణ కార్యకర్తలు బెజవాడ రవిబాబు.

వుట్ల కొండలరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెరుమలపల్లి ప్రకాశరావు మండల సహాయ కార్యదర్శి చావా మురళి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వర్లు,నాయకులు,కార్యకర్తలు శాఖ మహాసభల్లో పాల్గొన్నారు.

Advertisement

Latest Khammam News