'ఈటెల ' ప్రత్యర్ధి కౌశిక్ కాదు పెద్దిరెడ్డి ? 

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ను వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలనే పట్టుదలతో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్.రాజేందర్ కు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కేసీఆర్ .

అంతేకాదు ఉప ఎన్నికల్లోను ఈటల రాజేందర్ పై పోటీకి దింపారు.అనూహ్యంగా అక్కడ ఈటెల గెలుపొందడంతో , వెంటనే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

వచ్చే ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు ప్రత్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా దించాలని నిర్ణయించుకున్నారు .ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అనేక సందర్భాల్లో పాడి కౌశిక్ రెడ్డిని ఆశీర్వదించాలని హుజూరాబాద్ ప్రజలను కోరారు.అలాగే పూర్తిగా హుజురాబాద్ నియోజకవర్గం పైనే దృష్టి పెట్టాల్సిందిగా కౌశిక్ రెడ్డిని ఆదేశించారు.

ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా దించితే గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయనే అంచనా కు కేసీఆర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.దీనికి కారణం ఇటీవల కాలంలో కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అనేక వివాదాల్లో చిక్కుకోవడం వంటి విషయాలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.

దీంతో ఈటెల రాజేందర్ పై ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని పోటీకి దింపే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

అంతేకాదు పెద్దిరెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయం పైన పార్టీ కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారట.హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజేందర్ కు గట్టిపట్టు ఉండడంతో,  ఆయనను ఓడించేందుకు బలమైన నేతనే పోటీకి దింపాలని ఆలోచిస్తున్న కేసీఆర్ కౌశిక్ రెడ్డిని పోటీకి దింపితే గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని భావించే,  పెద్దిరెడ్డి పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి విషయంలో కెసిఆర్ సర్వే నివేదికలు, పార్టీ కీలక నేతలతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు