గొడ్రాలిని చేసి పిచ్చిదానిలా చిత్రీకరించారు.. నటుడి మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

మలయాళ నటుడు బాలా( Malayalam actor Bala ) గత ఏడాది కోకిలను పెళ్లి చేసుకన్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ జంటగా ఒక ఛానల్‌ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

అయితే ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్‌ లో ఈ జంటను ఆశీర్వదిస్తూ అతడి మాజీ భార్య పై అనుచిత కామెంట్లు చేశారు.బాల రెండో మాజీ భార్య, డాక్టర్‌ ఎలిజబెత్‌( Dr.Elizabeth ) నటుడిని ప్రలోభ పెట్టిందని, అతడు హాస్పిటల్‌ కు వెళ్లినప్పుడు బాలాను వశం చేసుకుందని ఆరోపించారు.ఒకవేళ రోగి ప్రపోజ్‌ చేసినా డాక్టర్‌ గా దాన్ని అంగీకరించకూడదు.

కానీ ఆమె నటుడిని వశపరుచుకుంది.ఇది వైద్య వృత్తికే కళంకం అంటూ కామెంట్స్‌ చేసింది.

దీనిపై ఎలిజబెత్‌ కాస్త ఘాటుగా స్పందించింది.

Elizabeth Udayan Allegations Actor Bala, Actor Bala, Elizabeth Udayan, Allegatio
Advertisement
Elizabeth Udayan Allegations Actor Bala, Actor Bala, Elizabeth Udayan, Allegatio

నిజంగా నేనలా చేసుంటే నాపై ఫిర్యాదు చేయొచ్చుగా! నేను అతడిని బెదిరించానా? ఇలాంటి ప్రచారం చేయించేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు.రాజకీయ నాయకుల సపోర్ట్‌ అసలే లేదు.అంతెందుకు, ఒకసారి నువ్వు నాపై అత్యాచారం చేశాక ఇంటికి తీసుకెళ్లండంటూ చెన్నై లోని ఒక పోలీస్ ఆఫీసర్‌ నా పేరెంట్స్‌ కు ఫోన్‌ చేశాడు.

చచ్చిపోదామని ప్రయత్నించాను.కానీ నేను నీ భార్య కాదని చెప్తున్నావు.అలాగైతే నా అనుమతి లేకుండా నువ్వు చేసిన పనిని ఇంకేమంటారు? జనాలు నా గురించి నోటికొచ్చింది వాగుతున్నప్పుడు నేను నోరు విప్పక తప్పడం లేదు.అలాగే నేను నిజాల్ని వెల్లడిస్తూ పోస్ట్‌ పెట్టడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.

కానీ చాలా భయంగా ఉంది.ఇప్పుడు నేను చట్ట పరంగా ముందుకు వెళ్లాలన్నా కూడా గతంలో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తారు.నేను ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు.

నాకు మానసిక స్థితి సరిగా లేదని ప్రచారం చేస్తున్నారు.దయచేసి ఈ పోస్ట్‌ ను సాక్ష్యంగా పెట్టుకోండి అని ఫేస్‌బుక్‌ లో రాసుకొచ్చింది.

Elizabeth Udayan Allegations Actor Bala, Actor Bala, Elizabeth Udayan, Allegatio
తీహార్‌లోని మగ ఖైదీల బ్లాక్‌లో యువతి.. కళ్లారా ఏం చూసిందంటే?
హైపర్ ఆది నన్ను ఫ్లర్ట్ చేశాడు.. వైరల్ అవుతున్న దీపు నాయుడు షాకింగ్ కామెంట్స్!

మరో పోస్ట్‌లో.బాలాను నేను ఫేస్‌బుక్‌ లో కలిశాను.అతడు నాతో రిలేషన్‌ లో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో చేసిన చాటింగ్‌, వాయిస్‌ రికార్డింగ్స్‌ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి.పోలీసుల ఎదుట మా పెళ్లి జరిగింది.

Advertisement

ఈ పెళ్లికి అతిథులు కూడా వచ్చారు.అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎలా పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు.

నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు.నా కుటుంబాన్ని కూడా వేధించాడు.

తన గురించి చెప్తే వదిలిపెట్టనని చివరికి గూండాలతో కూడా హెచ్చరించాడు.మా బెడ్‌రూమ్‌ వీడియో లీక్‌ చేస్తానని బెదిరించాడు అని ఆమె తెలిపింది.

తాజా వార్తలు