సైన్స్ ఫిక్షన్ (Science fiction )సినిమాల్లో చూసే కార్లు నిజంగానే రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి.‘అలెఫ్ ఏరోనాటిక్స్’ అనే కంపెనీ అదిరిపోయే ఫ్లయింగ్ కారును తయారు చేసింది.దీని ధర అక్షరాలా రూ.2.5 కోట్లు.చూడ్డానికి నార్మల్ కారులాగే ఉన్నా, ఇందులో ముందు వెనకాల సీక్రెట్ ప్రొపెల్లర్లు ఉన్నాయి.
ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకున్నా ప్రాబ్లమే ఉండదు, దీని రెక్కలు విప్పేసి గాల్లోకి ఎగిరిపోవచ్చు.
యూఎస్ కు చెందిన ఈ కంపెనీ మొన్నామధ్య ఈ కారు గాల్లోకి ఎగురుతున్న వీడియోను రిలీజ్ చేసింది.
దాన్ని చూస్తుంటే నిజంగా సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది.ఈ కారులో చాలా ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి, వాటితోనే ఇది గాల్లోకి లేస్తుంది.
ప్రొపెల్లర్ బ్లేడ్లకు సేఫ్టీ మెష్( Safety mesh for propeller blades ) కూడా పెట్టారు, టెన్షన్ లేదు.ప్రస్తుతానికి ‘అలెఫ్ మోడల్ జీరో’ అనే లైట్ వెయిట్ నమూనాతో టెస్టులు చేస్తున్నారు.
అలెఫ్ సీఈఓ జిమ్ డుఖోవ్నీ ఏమన్నారంటే, “1903లో రైట్ బ్రదర్స్ విమానం ఎగురవేసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు మా ఫ్లయింగ్ కారు కూడా అంతే.ఇదిగో చూశారుగా, సిటీ రోడ్ల మీద కూడా ఫ్లయింగ్ కార్లు నడుస్తాయని మేం ప్రూవ్ చేశాం” అని సంబరపడిపోయారు.

వీడియో వైరల్ అయిందో లేదో, జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.కొందరు “వావ్, చిన్నప్పుడు నేను ఫ్లయింగ్ కార్లు ఇలాగే ఉంటాయని ఊహించుకున్నా” అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు మాత్రం డౌట్లు అడుగుతున్నారు.“దీన్ని గాల్లోకి లేపడానికి ఎంత పవర్ కావాలో?” అని ఒకరు అంటే, ఇంకొకరు “ఇక పార్కింగ్ ఈజీ అవుతుందా లేక నరకం చూపిస్తుందా” అని కామెడీ కామెంట్లు పెడుతున్నారు.
అలెఫ్ కంపెనీ ఇప్పుడు రెండు సీట్ల ‘అలెఫ్ మోడల్ ఏ’ కారును రెడీ చేస్తోంది.ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 177 కిలోమీటర్లు గాల్లో, 321 కి.మీ రోడ్డు మీద ప్రయాణిస్తుంది.ఆటోపైలట్ మోడ్ కూడా ఉంటుంది.
ఇప్పటికే దీని కోసం 3,300 మంది బుకింగ్ కూడా చేసుకున్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

2035 నాటికి ఏకంగా నలుగురు కూర్చునే ‘అలెఫ్ మోడల్ జెడ్’ కారును లాంచ్ చేస్తారట.అది 200 మైళ్లు గాల్లో, 400 మైళ్లు రోడ్డు మీద వెళ్తుంది.ఈ ఫ్లయింగ్ కార్లు వస్తే ట్రావెలింగ్ మొత్తం మారిపోతుంది అనడంలో డౌటే లేదు.
కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఫ్లయింగ్ కార్లు మన డైలీ లైఫ్ లో పార్ట్ అవుతాయా లేదా అనేది చూడాలి.







