బడి గోడ పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల ( Bommalaramaram Mandal )కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ పక్కనే ఎలాంటి రక్షణ కవచం లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో విద్యార్దులకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అభం శుభం తెలియని చిన్నారులు అనుకోకుండా అటు వైపుకు వెళితే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ను అక్కడి నుండి తరలించాలని, లేదా చుట్టూ రక్షణ కంచె నిర్మించాలని కోరుతున్నారు.

Latest Video Uploads News