నిధులొచ్చాయ్ .. విధులు మొదలయ్యాయ్ ! వేగం పెంచిన ఈసీ ఆ లావాదేవీలపై కన్ను

రాజకీయ పరిణామాలు తెలంగాణాలో శరవేగంగా మారిపోతున్నాయ్ ! పార్టీల కంగారుకు తగినట్టుగానే ఈసీ కూడా ముందస్తు ఎన్నికల నిర్వహణకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటూ వేగం పెంచింది.

ముందస్తు ఎన్నికలను త్వరగా అంటే అసెంబ్లీ రద్దు అయిన ఆరు నెలల లోపుగానే ఎన్నికలు నిర్వహించాలని తొందరపడుతోంది.

దీనికి సంబంధించి ఈసీ అడుగులు త్వరపడుతున్నాయి.ఈవీఎంలకు అయ్యే ఖర్చును కేంద్ర ఎన్నికల సంఘం భరిస్తుందని కేంద్రం ఎన్నికల కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఉమేశ్ సిన్హా తెలిపారు.

Election Commission To Keep Tab On High Value Bank Transactions

ఈ ఎన్నికల తంతులో భాగంగా తెలంగాణాలో జరిగిన భారీ లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని ఐటీ అధికారులను ఉమేశ్ సిన్హా కోరారు.తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్లు విడుదల చేసిందని, త్వరలో మరింత బడ్జెట్‌ను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ వెల్లడించారు.ఈ ఎన్నికల సందర్భంగా బ్యాంకుల్లో జరిగే పెద్ద లావాదేవీలపై ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ ఉంటుందని, ఆదాయపుపన్నుశాఖ అధికారులతో కలిసి అధిక విలువైన బ్యాంకు లావాదేవీలను గుర్తించే పనిని ప్రత్యేకంగా చేపడుతున్నామన్నారు.

రాష్ట్రంలో ఎనిమిది నెలల ముందుగానే శాసనసభను రద్దుచేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు.

Advertisement
Election Commission To Keep Tab On High Value Bank Transactions-నిధుల

ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌ను కలిసి బ్యాంకుల లావాదేవీలపై దృష్టిసారించాలని సూచించారని, ఈ నేపథ్యంలో భారీ ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు.గత ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచార ఖర్చుల వివరాలను అందజేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 122 మంది ప్రతినిధులకు నోటీసులు జారీచేశామని రజత్‌కుమార్ చెప్పారు.

ఎవర్రా మీరంతా..! వ్యక్తిని పాడె ఎక్కించి అలా డాన్సులు చేస్తున్నారు!
Advertisement

తాజా వార్తలు