ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‎షీట్..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఈడీ ఇవాళ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.

ఈ క్రమంలో ఈడీ ఛార్జ్‎షీట్ లో పేర్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.రూ.100 కోట్లను విజయ్ నాయర్ ద్వారా ఆప్, ఎక్సైజ్ శాక అధికారులకు అందజేశారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.ఛార్జ్‎షీట్ లో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా సహా పలువురి ప్రముఖుల పేర్లు ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సమీర్ మహేంద్రు పేర్లను ఛార్జ్‎షీట్ లో ఈడీ ప్రస్తావించింది.సమీర్ మహేంద్రు కంపెనీలపై నవంబర్ లో తొలి ఛార్జ్‎షీట్ దాఖలు చేశారు.

అదేవిధంగా లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు