ఖాళీ క‌డుపుతో ఈ ఆకులు తింటే రక్తశుద్ధితో స‌హా బోలెడు ఆరోగ్య లాభాలు!

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే మొక్క‌ల్లో పుదీనా( Mint ) ఒక‌టి.బిర్యానీ, పులావ్ వంటి రైస్ ఐటెమ్స్‌లో.

నాన్ వెజ్ వంట‌ల్లో పుదీనాను విరివిగా ఉప‌యోగిస్తారు.ఆహారం రుచిని పెంచ‌డంలో, ప్ర‌త్యేక‌మైన ప్లేవ‌ర్ ను జోడించ‌డంలో పుదీనా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అలాగే ఆరోగ్య ప‌రంగా పుదీనా అనేక ప్రయోజ‌నాల‌ను అందిస్తుంది.ముఖ్యంగా ఖాళీ క‌డుపుతో నాలుగు పుదీనా ఆకులు తింటే ర‌క్త‌శుద్ధితో స‌హా బోలెడు ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

అందుకోసం ఉద‌యం నిద్ర లేచి బ్రష్ చేసుకున్న అనంత‌రం న‌లుగు ఫ్రెష్ పుదీనా ఆకుల‌ను శుభ్రంగా క‌డిగి నోట్లో వేసుకుని న‌మిలి తినాలి.ఆపై ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని సేవించాలి.

Advertisement

ఈ విధంగా ప్ర‌తి రోజూ చేస్తే.పుదీనా ఆకుల్లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ( Antioxidants )ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి.

శ‌రీరంలో పేరుకుపోయిన మ‌ల‌నాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి.అలాగే పుదీనాలో ఉన్న నేచురల్ ఆయిల్స్ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ వంటి సమస్యల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తాయి.

ఖాళీ క‌డుపుతో నాలుగు పుదీనా ఆకులు తింటే ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి ( Iron, Vitamin A, Vitamin C )వంటి పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి.ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిండ‌చంలో, చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచ‌డంలో తోడ్ప‌డ‌తాయి.ఖాళీ క‌డుపుతో పుదీనా ఆకులు తింటే ముఖంపై మొటిమ‌లు రాకుండా ఉంటాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్2, బుధవారం 2025
మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడా..?

అలాగే పుదీనా ఆకుల్లోని మెంథాల్ మనసును ప్రశాంతంగా మారుస్తుంది.ఒత్తిడి, ఆందోళ‌న వంటి మానసిక స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

Advertisement

పుదీనా ఆకుల్లోని యాంటీ బాక్టీరియల్ ( Antibacterial )లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌ను దూరం చేసి తాజా శ్వాసను అందిస్తాయి.బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించేవారు ఖాళీ క‌డుపులో పుదీనా టీ తాగితే చాలా మంచి ఫ‌లితాలు పొందుతారు.

అయితే ఆరోగ్యానికి మంచిద‌ని ఖాళీ కడుపుతో ఎక్కువ పుదీనా తింటే గాస్ట్రిక్ సమస్యలు త‌లెత్త‌వ‌చ్చు జాగ్ర‌త్త‌.

తాజా వార్తలు