దక్షిణాసియాలో రెచ్చిపోతున్న బ్రోకర్లు, ఏజెంట్లు : అక్రమంగా వీసా అపాయింట్‌మెంట్స్ సేవలు , యూకే దర్యాప్తులో వెలుగులోకి

ఉన్నత విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇటీవలి కాలంలో భారతీయులతో పాటు అన్ని దేశాల వాసులు విదేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.

వీరి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్( Immigration ) రంగం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.కన్సల్టెన్సీలు, ట్రావెల్, వీసా సేవలు, డాక్యుమెంటేషన్, ట్రైనింగ్ తదితర వ్యాపార సంస్థలు ప్రతి చోటా కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి.

వీటిలో ప్రభుత్వ గుర్తింపు వున్న సంస్థలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.మిగిలినవన్నీ భోగస్ సంస్థలే.

ఇలాంటి వారి ట్రాప్‌లో చిక్కుకుంటే పరాయి దేశంలో ఎన్నో ఇబ్బంది పడాల్సి వుంటుందనడానికి నిత్యం ఎన్నో ఉదాహరణలు.

Dubious Agents Running Illicit Uk Visa Appointments Trade In India, Other South
Advertisement
Dubious Agents Running Illicit UK Visa Appointments Trade In India, Other South

కాగా.అనుమానాస్పద ఏజెంట్లు దక్షిణాసియాలో అక్రమ వీసా అపాయింట్‌మెంట్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని యూకే మీడియా నిర్వహించిన దర్యాప్తులో తేలింది.భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో విద్యార్ధులు, కార్మికుల నుంచి ఈ తరహా ఏజెంట్లు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపింది.

ఆదివారం ‘‘ ది అబ్జర్వర్ ’( The Observer )’ వార్తాపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో బ్రోకర్లు విదేశాల్లోని సోషల్ మీడియా మేసేజింగ్ సేవల ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్స్( Biometric Appointments ) కోసం 800 పౌండ్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

గడిచిన ఏడాది కాలంలో ఈ ఏజెంట్లు వీసా అపాయింట్‌మెంట్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేయడం గణనీయంగా పెరిగిపోయిందని .పాకిస్తాన్‌లో ఈ సమస్య దారుణంగా వుందని ది అబ్జర్వర్ వెల్లడించింది.నిజానికి ఇదో పెద్ద సమస్యగా మారిందని యూకే కేంద్రంగా పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ బిజినెస్‌( Institute for Human Rights and Business )లో మైగ్రేషన్ వర్కర్స్ కార్యక్రమానికి దక్షిణాసియా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న రాకేష్ రంజన్ పేర్కొన్నారు.

ఇటీవల న్యూఢిల్లీ నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో తన డాక్యుమెంట్‌లను సిద్ధం చేసుకోవడానికి, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడంలో అతనికి సహాయపడటానికి ఆయన ఒక ఏజెంట్‌ను ఆశ్రయించాడు.అతను ప్రభుత్వ రుసుములును మినహాయించి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మరో 500 పౌండ్ల మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు రాకేష్ తెలిపారు.

Advertisement

ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు యూకేలో ఉండాలనుకునే వారు , నిర్దిష్ట దేశాల నుంచి వచ్చే స్వల్పకాలిక సందర్శకులు తమ వేలిముద్రలు , ఫోటోగ్రాఫ్‌ను అందించడానికి వారి స్వదేశంలో వ్యక్తిగతంగా అపాయింట్‌మెంట్‌కు తప్పనిసరిగా హాజరుకావాలి.వీసా దరఖాస్తు అపాయింట్‌మెంట్ సిస్టమ్‌( Visa Appointment System )ను దుర్వినియోగం చేసే అన్ని ప్రయత్నాలను తాము తీవ్రంగా పరిగణిస్తామని యూకే హోమ్ ఆఫీసుతో కలిసి పనిచేసే వీఎఫ్ఎస్ గ్లోబల్ ప్రతినిధి మీడియాకు తెలిపారు.అనధికారిక ఏజెంట్లను నియంత్రించడానికి .కంపెనీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవాలని ఆయన వెల్లడించారు.అలాగే దక్షిణాసియాలోని అనధికారిక ఏజెంట్ల ద్వారా వీసా అపాయింట్‌మెంట్ బుకింగ్ ప్రక్రియను దుర్వినియోగం చేయడాన్ని పరిష్కరించడానికి పటిష్టమైన చర్య తీసుకుంటున్నట్లు యూకే హోమ్ ఆఫీస్ వెల్లడించింది.

తాజా వార్తలు