కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేయొద్దు..: హరీశ్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు( Former Minister Harish Rao ) అన్నారు.

పెన్షన్ విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్( Congress ) మాటలతో అరచేతిలో వైకుంఠం చూపించిందని విమర్శించారు.రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఎవరికైనా రూ.2,500 పడ్డాయా.? అని ప్రశ్నించారు.నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు.కానీ ఇప్పుడు హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై కోపంతో బీజేపీ( BJP )కి ఓటేయొద్దని సూచించారు.బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనని చెప్పారు.

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?

తాజా వార్తలు