మహాశివరాత్రి నాడు పొరపాటున కూడా శివలింగానికి ఈ వస్తువులను తాకించ‌కండి!

దేశంలో మహా శివరాత్రికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అయితే ఫాల్గుణ మాసంలో వ‌చ్చే మహాశివరాత్రి కోసం భక్తులు ఏడాది పొడవునా ఆసక్తిగా ఎదురు చూస్తారు.

మహా శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూర్తి విశ్వాసంతో పూజలు చేస్తారు.ఆ రోజున మ‌హా శివుడు.

పార్వ‌తీ అమ్మ‌ వారిని వివాహం చేసుకున్నట్లు చెబుతారు.ఈ సంవత్సరం మహా శివరాత్రి పండుగను మార్చి ఒక‌టిన‌ జరుపుకోబోతున్నారు.

ఆ రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.దీనితో పాటు శివలింగానికి ప్రత్యేక వస్తువులను సమర్పించడం వల్ల అన్ని రకాల రోగాలు తొలగి పోతాయి.

Advertisement
Dont Touch These Things To Shiva Lingam On Mahashivaratri Details, , Shiva Linga

అయితే మహాశివరాత్రి నాడు శివలింగానికి ఏ వస్తువులు సమర్పించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మహాశివరాత్రి రోజున శివలింగంపై తులసి ఆకులను ఎప్పుడూ సమర్పించకూడదు.

ఈ రోజున శివలింగానికి పాశ్చరైజ్డ్ లేదా ప్యాకెట్ పాలను సమర్పించకూడదని భక్తులు గుర్తుంచుకోవాలి.

Dont Touch These Things To Shiva Lingam On Mahashivaratri Details, , Shiva Linga

వీలైనంత వరకు చల్లటి పాలను మాత్రమే స్వామికి సమర్పించండి.పంచామృతాన్ని ఎల్లప్పుడూ శివలింగానికి సమర్పించాలి.ఈ రోజున భక్తులు కూడా పూర్తి భక్తితో, భావంతో ఉపవాసం ఆచరించి, పూజాదికాలు నిర్వ‌హించిన మ‌రుస‌టి రోజు స్నానం చేసి, ఉపవాసం విరమించాలి.ఈసారి మహాశివరాత్రి మార్చి 1 మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు ప్రారంభం కానుంది.మార్చి 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు చతుర్దశి ముగియనుండగా, మహాశివరాత్రి ఉపవాసం, పూజలు మార్చి 1న నిర్వ‌హించాల్సి వుంటుంది.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement
" autoplay>

తాజా వార్తలు